ఈ హల్వా తింటే.. హిమోగ్లోబిన్ అమాంత రెట్టింపు!

బీట్‌ రూట్‌లో ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి.

ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్ల ఎక్కువ.

హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు దీని తీసుకోవడం చాలా మంచిది.

నేరుగా తినడానికి ఇష్టపడనివారు ఈ హల్వాను తయారు చేసుకోండి.

కావలసిన పదార్థాలు: బీట్రూట్లు - తురుము, పాలు - 2 కప్పులు, పచ్చి కోవా - 3 టీస్పూన్లు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

కావలసిన పదార్థాలు: పంచదార - 1/2 కప్పు, యాలకుల పొడి - 1/2 టీస్పూన్, జీడిపప్పులు - కొద్దిగా

ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, అందులో జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించాలి

వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసుకోవాలి

తురిమిన బీట్రూట్‌ను వేసి మూత పెట్టి, మెత్తగా ఉడికే వరకు వేయించాలి.

వేయించిన బీట్రూట్‌లో పాలు, పచ్చి కోవా వేసి బాగా కలపండి.

మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి.

ఉడికిన మిశ్రమంలో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపండి.

హల్వా చిక్కగా అయ్యాక, వేయించిన జీడిపప్పులు వేసి కలపండి.

దీని వేడి వేడి సర్వ్ చేయండి.

Read Next Story