Home> అంతర్జాతీయం
Advertisement

చైనా కీలక నిర్ణయం.. రాజ్యాంగంలో మార్పులు

చైనా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకోబోతోంది. 

చైనా కీలక నిర్ణయం.. రాజ్యాంగంలో మార్పులు

బీజింగ్‌(చైనా): చైనా ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం ఆ దేశానికి అధ్యక్షుడుగా సేవలందిస్తున్న జీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అందుకుగానూ రాజ్యాంగంలో మార్పులు చేయబోతోంది. చైనా రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు రెండు దఫాలు మాత్రమే పనిచేసి తర్వాత దిగిపోవాలి. కానీ అధికార కమ్యూనిస్టు పార్టీ ఈ నిబంధనను తొలగించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 2022 తరువాత కూడా జీ జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ఓ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించింది అని చైనా అధికార మీడియా జినువా వెల్లడించింది. 

దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. చైనా పాలకుల్ని ఉత్తర కొరియా నియంతలతో పోల్చారు. దీంతో అక్కడి ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. వరుసపెట్టి వెబ్సైటులను, ఆన్ లైన్ వ్యాసాల లింక్ లను బ్లాక్ చేసింది. పార్టీని పొగడ్తలతో ముంచెత్తుతూ కొత్త ప్రచారానికి తెరలేపింది. 

Read More