Home> అంతర్జాతీయం
Advertisement

Who is Kevan Parekh: ఆపిల్ కంపెనీ కొత్త సీఎఫ్ఓ కేవన్ పరేఖ్ ఎవరు, ఈ పదవికి ఆయనే ఎందుకు

Who is Kevan Parekh: ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ కీలక బాధ్యతల్ని మరో భారతీయుడు అందుకోనున్నాడు. పూర్తి వివరాలు మీ కోసం.

Who is Kevan Parekh: ఆపిల్ కంపెనీ కొత్త సీఎఫ్ఓ కేవన్ పరేఖ్ ఎవరు, ఈ పదవికి ఆయనే ఎందుకు

Who is Kevan Parekh: ఆపిల్ కంపెనీ గురించి తెలియనివారుండరు. అటు సాఫ్ట్‌వేర్ ఇటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో దూసుకుపోతోంది. ఎన్ని స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినా ఆపిల్ బ్రాండ్ ఇమేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. ధర ఎంత ఉన్నా కొనుగోళ్లు తగ్గడం లేదు. అదే ఆపిల్ ప్రత్యేకత. ఇలాంటి కంపెనీ కీలక పదవిలో ఓ భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి రానున్నారు. ఎవరీ వ్యక్తి, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

త్వరలో ఆపిల్ కంపెనీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే సీఎఫ్ఓగా భారత సంతతికి చెందిన కేవన్ పరేఖ్ వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 1న బాథ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఆపిల్ కంపెనీ సీఈవో టీమ్ కుక్ స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ సీఎఫ్ఓగా లూకా మేస్త్రి ఉన్నారు. ఆయన ఈ పదవి నుంచి తప్పుకోవడంతో కొత్త సీఎఫ్ఓగా 11 ఏళ్ల నుంచి ఆపిల్ కంపెనీలో పనిచేస్తున్నకేవన్ పరేఖ్ ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేవన్ పరేఖ్ ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా సేల్స్, రీటైల్, మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. ఆపిల్ కంపెనీ ఆర్ధిక వాణిజ్య విభాగంలో కేవన్ పరేఖ్ అత్యంత కీలక వ్యక్తి. ఈయన సామర్ధ్యం, ఫైనాన్షియల్ స్కిల్స్ గుర్తించిన ఆపిల్ కంపెనీ తదుపరి సీఎఫ్ఓగా ప్రకటించింది. 

మిచిగాన్ యూనివర్శిటీ నుంచి 1989-1993లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అందుకుని..ఆ తరువాత యూనివర్శిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. 

ఆపిల్ కంపెనీ కంటే ముందు కేవన్ పరేఖ్ థామ్సన్ రాయిటర్స్ , జనరల్ మోటార్స్ కంపెనీల్లో కీలకమైన పదవుల్లో ఉన్నారు. ఫైనాన్స్, కార్పొరేట్ ట్రెజరర్, డైరెక్టర్ ఆఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ రీజనల్ ట్రెజరర్ విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్ బాధ్యతల్లో ఉన్నారు. 

2013లో ఆపిల్ కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎనానలసిస్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. ప్రస్తుతం ఆపిల్ కంపెనీ సీఎఫఓగా ఉన్న లూకా మేస్త్రి స్వయంగా తన తరువాత ఈ పదవికి కేవన్ పరేఖ్ సమర్ధుడని భావించి సిద్ధం చేశారు. సీఎఫ్ఓ నుంచి తప్పుకున్న తరువాత కూడా లూకా మేస్త్రి ఆపిల్ కంపెనీలో కొనసాగనున్నారు. కార్పొరేట్ సర్వీసెస్ టీమ్‌ను లీడ్ చేస్తూ సీఈవోకు రిపోర్ట్ చేస్తారు. 

Also read: Bermuda Triangle Secret: బెర్ముడా ట్రయాంగిల్‌లో ఏం జరుగుతోంది, రహస్యం తెలిసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More