Home> అంతర్జాతీయం
Advertisement

Who is Pavel Durov: టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ గురించి పూర్తి వివరాలు.. అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటే..!

Pavel Durov Arrested in France: టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం,  మారకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి ఆరోపణల కారణంగా టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ను తాజాగా ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతని గురించి పూర్తి వివరాలు మీకోసం..

Who is Pavel Durov: టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ గురించి పూర్తి వివరాలు.. అసలు ఎందుకు అరెస్ట్ చేశారంటే..!

Telegram CEO arrested: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు,  సీఈఓ పావెల్ దురోవ్ (39) ను ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం అజర్ బైజాన్ నుంచి పారిస్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం,  మారకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి ఆరోపణలు ఇతడి పై ఉన్నాయి.  దీంతో గతంలో అరెస్టు వారెంటీ జారీ చేసిన అధికారులు ఇప్పుడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఇతడు ఎవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి ..?అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. పావెల్ దురోవ్ రష్యాలో జన్మించారు.  ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఫ్రెంచ్ పౌరసత్వం పొందిన ఈయన టెలిగ్రామ్ యాప్ ను రూపొందించారు. ఈ ఆప్ ను సుమారు రూ.90 కోట్ల మంది వినియోగదారులు వినియోగిస్తున్నారు. అయితే ఈయనపై రష్యా ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాక్ స్వాతంత్ర్యం పై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రణాళికలకు ఇదే నిదర్శనం.. అంటూ వారు వ్యాఖ్యానించారు. 

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. టెలిగ్రామ్ యాప్ కు సంబంధించిన కేసులో ఈయనను అరెస్ట్ చేశారు. వాస్తవానికి టెలిగ్రామ్ లో మోడరేటర్లు లేకపోవడంపై ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తుని కేంద్రీకరించగా మోడరేటర్ లు లేకపోవడం వల్లే మెసేజింగ్ యాప్ లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని వారు తెలిపారు. దీని కారణంగానే యాప్ ద్వారా నేర కార్యకలాపాలు పెరుగుతున్నట్లు ఫ్రెంచ్ ఏజెన్సీ OFMIN స్పష్టం చేసింది. 

ఇకపోతే దురోవ్ తన సోషల్ మీడియా నెట్వర్కింగ్ ఫ్లాట్ ఫారం టెలిగ్రామ్ నేరపూరిత.. వినియోగాన్ని అరికట్టడంలో విఫలమయ్యారు అని ఏజెన్సీ తెలిపింది. అందుకే ఇతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు.  దాదాపు 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఈ యాప్ తటస్థ ఫ్లాట్ ఫామ్ గా ఉంటుందని దురోవ్ చెబుతున్నారు. ఈ కేసులో 20 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. 

39 ఏళ్ల దురోవ్  రష్యాలో జన్మించారు. మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకులు టెలిగ్రామ్ అనేది ఉచిత సోషల్ నెట్వర్కింగ్ యాప్. ఫేస్బుక్, యూట్యూబ్, వీ చాట్ , వాట్సప్,  ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ ఫ్యాట్ ఫామ్ ఉన్నప్పటికీ దీనికి మంచి గుర్తింపు వచ్చింది. దురోవ్ 2014లో రశ్యాను విడిచిపెట్టి దుబాయ్ కి వచ్చాడు. నివేదిక ప్రకారం ఆయన ఆస్తి విలువ 15.5 బిలియన్లు అని సమాచారం.

Also Read:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

Also Read: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More