Home> అంతర్జాతీయం
Advertisement

US President Joe Biden: రిపోర్టర్ ను అసభ్య పదజాలంతో దూషించిన బైడెన్, వీడియో వైరల్!

Joe Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్ విలేకరులపై మరోసారి అగ్రహం వ్యక్తం చేశారు. అసభ్య పదజాలాన్ని వాడుతూ వివాదంలో చిక్కుకున్నారు. 
 

US President Joe Biden: రిపోర్టర్ ను అసభ్య పదజాలంతో దూషించిన బైడెన్, వీడియో వైరల్!

US President Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) వివాదంలో చిక్కుకున్నారు. ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఓ రిపోర్టర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకున్నారు. వాషింగ్టన్​లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధ్యక్షుడు బైడెన్​ను.. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీటర్ డూసీ (Fox News correspondent Peter Doocy) ధరల పెరుగుదలపై ప్రశ్నించారు. అధిక ద్రవ్యోల్బణం ( inflation) వల్ల మిడ్​టెర్మ్ ఎలక్షన్స్​ ఫలితాలపై ప్రభావం పడుతుందా అని అడిగారు. 

దీంతో బైడెన్ బూతు పురాణం అందుకున్నారు. 'అధిక ద్రవ్యోల్బణంతో లాభమే. స్టుపిడ్ సన్ ఆఫ్ ఎ **' అంటూ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. బైడెన్ మాటలకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు కెమెరా, మైక్రోఫోన్లలో రికార్డ్ అయ్యాయి. 

అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలపై శ్వేతసౌధం (White House) ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే రిపోర్టర్ పీటర్ డూసీని తన కార్యాలయానికి పిలుపించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్​లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. అయితే, ఇటీవల ఫాక్స్ న్యూస్ ఛానళ్ల రిపోర్టర్లు, బైడెన్​ మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతవారం రష్యా (Russia) గురించి ఫాక్స్ న్యూస్ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నపై గుర్రుమన్నారు. 'ఉక్రెయిన్ విషయంలో పుతిన్​ తొలి అడుగు వేసేంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారని మహిళ అడగ్గా.. 'అదో చెత్త ప్రశ్న' అని కొట్టిపారేశారు.

Also read: Live Reporting: లైవ్‌లో ఢీ కొట్టిన కారు, అయినా ఆగని లైవ్ రిపోర్టింగ్, వీడియో వైరల్

ప్రస్తుత ఘటనలో దూషించబడిన డూసీతో గతంలో కూడా బైడెన్ దురుసుగా మాట్లాడారు. 'నువ్వు నన్ను ఎప్పుడూ మంచి ప్రశ్నలే అడుగుతావు' అని డూసీని ఉద్దేశించి బైడెన్ వ్యంగ్యంగా అన్నారు. దానికి రిపోర్టర్.. 'నా వద్ద చాలా ప్రశ్నలు ఉన్నాయి' అని బదులివ్వగా.. 'అవును.. నీ దగ్గర చాలా ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. కానీ అందులో ఒక్కటి కూడా పనికొచ్చేదని నాకు అనిపించదు' అని ఎదురుదాడికి దిగారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook.మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More