Home> అంతర్జాతీయం
Advertisement

ముగిసిన అమెరికా షట్ డౌన్..!

మూడు రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. గత మూడు రోజులుగా స్తంభించిన అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. 

ముగిసిన అమెరికా షట్ డౌన్..!

మూడు రోజులుగా కొనసాగుతున్న అమెరికా ప్రతిష్టంభనకు తెరపడింది. గత మూడు రోజులుగా స్తంభించిన అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రతిపక్ష నాయకుల మధ్య ఒప్పందం కుదరడంతో ద్రవ్య వినిమయ బిల్లు సభలో ఆమోదం పొందింది. 

చిన్న పిల్లలుగా ఉన్నపుడు అమెరికాకు వచ్చిన వలసదారుల భవిష్యత్ పై ఒప్పదం కుదుర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించిందని, స్వల్పకాలిక ద్రవ్య వినిమయ బిల్లుకు మద్దతు పలుకుతున్నామని ప్రతిపక్ష డెమొక్రాట్ల నాయకుడు అన్నారు. సెనేట్ స్వల్పకాలిక బిల్లును ఆమోదించినందున ప్రభుత్వ నిధులు ఫిబ్రవరి 8వరకే అందుతాయి. ఆ తరువాత డెమొక్రాట్ల షరతులను మరోసారి ప్రభుత్వం అంగీకరించడాన్ని బట్టి బిల్లు భవిత్వం ఆధారపడి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Read More