Home> అంతర్జాతీయం
Advertisement

Omicron scare: ఒక్క రోజులో 12,133 ఒమిక్రాన్​ కేసులు.. ఎక్కడంటే?

Omicron scare: బ్రిటన్​లో ఒమిక్రాన్​ తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఒక్క రోజులో ఆ దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బ్రిటన్ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 37 వేలు దాటాయి.

Omicron scare: ఒక్క రోజులో 12,133 ఒమిక్రాన్​ కేసులు.. ఎక్కడంటే?

Omicron scare: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వేరియంట్​ వేగంగా (Omicron Update) వ్యాపిస్తోంది. యూకేలో మాత్రం ఈ వేరియంట్ ఇప్పటికే ఆందోళనకరస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఒక్క రోజులోనే (ఆదివారం) ఆ దేశంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగాయి.

కొత్తగా 82,886 మందికి కరోనా సోకగా అందులో.. 12,133 ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు (UK Omicron updates) కావడం అక్కడ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక యూకే వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్​ వేరియంట్ కేసుల (Omicron cases in UK) సంఖ్య 37,101కు చేరింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,361,387కు పెరిగినట్లు బ్రిటన్​ ఆరోగ్య విభాగం వెల్లడించింది.

కరోనా రోజువారీ కేసుల సంఖ్య గత వారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ ఒమిక్రాన్​ వేరియంట్ కేసుల్లో మాత్రం భారీ వృద్ధి నమోదవుతు వస్తోంది. ఇటీవల ఒక్క రోజులో ఆ దేశంలో 93,045 కొవిడ్ కేసులు (Corona cases in UK) నమోదయ్యాయి.

కరోనా కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం తక్కువగానే నమోదవుతుండటం కాస్త ఊరటకలిగించే విషయం. ఆదివారం ఆ దేశంలో 45 మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు. దీనితో బ్రిటన్ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 147,218కి చేరింది.

లెక్కలకన్నా ఎక్కువే..

దేశంలో కరోనా వ్యాప్తి గణాంకాలు చెబుతున్న దానికన్నా ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని బ్రిటన్​ ఆరోగ్య విభాగ కార్యదర్శి వెల్లడించారంటే.. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది పరీక్షలు చేసుకోవడం లేదని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా.. దేశంలో పరిస్థితులు మరింత దిగజారకముందే కట్టడి చర్యలు అవసరమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడతున్నారు. ఇందుకోసం కఠిన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా రెట్టింపు వేగంతో వ్యాప్తి..

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు 89 దేశాల్లో ఈ వేరియంట్ బయటపడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. కేవలం మూడు రోజుల్లోపే కేసులు రెట్టింపైనట్లు వివరించింది.

Also read: Rare Pregnancy Case: అత్యంత అరుదైన ప్రెగ్నెన్సీ కేసు... ఆ మహిళ కాలేయంలో పిండం...

Also read: UberEats: స్పేస్​లోకి పుడ్ డెలివరీ చేసిన తొలి సంస్థగా 'ఉబర్ ఈట్స్'..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More