Home> అంతర్జాతీయం
Advertisement

Turkey: టర్కీలో అడుగంటుతున్న నీళ్లు..కరువు పరిస్థితులు

టర్కీ మరో ఎడారిగా మారనుందా..తీవ్ర కరువు కాటకాలు తలెత్తనున్నాయా..దేశంలో వర్షాలు ఎందుకు తగ్గిపోయాయి..నిపుణుల హెచ్చరికతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Turkey: టర్కీలో అడుగంటుతున్న నీళ్లు..కరువు పరిస్థితులు

టర్కీ మరో ఎడారిగా మారనుందా..తీవ్ర కరువు కాటకాలు తలెత్తనున్నాయా..దేశంలో వర్షాలు ఎందుకు తగ్గిపోయాయి..నిపుణుల హెచ్చరికతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

పర్యాటకాని ( Tourism ) కి ప్రసిద్ధి చెందిన దేశాల్లో టర్కీ ( Turkey ) ఒకటి. నదులు, జలాశయాలతో ఎప్పుడూ కళకళలాడుతుండే దేశమది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో నీటి ఎద్దడి ( Water Scarcity ) ఏర్పడే సూచనలు కన్పిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వేసవికి తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటితో ఎప్పుడూ కళకళలాడుతూ కన్పించే ఇస్తాంబుల్ ( Istanbul ) సైతం ఎడారిలా మారనుందనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. 

టర్కీలోని ప్రధాన నగరాల్లో రానున్న కొద్దినెలల్లో నీళ్లు ఇంకిపోయ..ఎడారిని తలపించే పరిస్థితులు ఏర్పడుతాయనేది నిపుణులు చెబుతున్న మాట. దీని కారణం గత ఏడాది అత్యంత తక్కువ వర్షపాతం ( Lowest rainfall )  నమోదవడమే. 2020 నవంబర్ వరకూ కనీసం 50 శాతం వర్షపాతం కూడా నమోదవలేదు. ఫలితంగా రానున్న 45-5- రోజుల్లో టర్కీ దేశంలోని నదులు , జలాశయాలతోపాటు డ్యామ్‌లు ఎండిపోయి కరువు ( Drought ) సంభవించే అవకాశముంది. 17 మిలియన్ల టర్కీ ప్రజలు నీటి కొరత ( Water crisis ) ను ఎదుర్కోనున్నారు. 

టర్కీ దేశంలోని ప్రధాన నగరాలైన ఇజ్మిర్, బ్యూర్సాలోని డ్యామ్‌లలో ఇప్పటికే 24-36 శాతం వరకూ నీళ్లు ఇంకిపోయాయి. గోధుమ ఉత్పత్తి చేసే ప్రాంతాలైన కోన్యా ప్లేన్, ఎడ్రైన్ ప్రావిన్స్‌లలో సాగునీరు లేక రైతాంగం అల్లాడుతోంది. గ్రీస్, బుల్గేరియా సరిహద్దు ప్రాంతాల్లో సాగు చేయడమే కష్టంగా మారింది. నీటి డిమాండ్‌ను అదుపులో ఉంచే చర్యలకు బదులుగా మరిన్ని డ్యామ్‌లు నిర్మించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. 

నిపుణుల హెచ్చరికలు నిజమవుతాయా..లేదా అనేది ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. వర్షపాతం లేక..ఉన్న నీళ్లు అడుగంటుతూ పరిస్థితి దయనీయంగానే ఉందిప్పుడు. అందుకే ఇప్పుడు టర్కీ ప్రజలు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. 

Also read: Impeachment in America: అమెరికా చరిత్రలో అభిశంసన ఎదుర్కొంది ఎవరెవరు..ఎందుకు..ఏమైంది అప్పట్లో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More