Home> అంతర్జాతీయం
Advertisement

Alina Kabaeva: రష్యా - ఉక్రెయిన్ వార్.. స్విట్జర్లాండ్‌లో పుతిన్ ప్రియురాలికి కష్టాలు

పుతిన్ చర్యలు ఆమె కొంప కొల్లేరు చేసేలా మారాయి. ఉన్న చోట ఉండలేక.. వేరేచోటకు వెళ్లలేక ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తాయి. ఇంతకూ ఎవరామె ? ఆమెకు వచ్చిన కష్టం ఏంటి ? అని అనుకుంటున్నారా ? 

Alina Kabaeva: రష్యా - ఉక్రెయిన్ వార్.. స్విట్జర్లాండ్‌లో పుతిన్ ప్రియురాలికి కష్టాలు

Alina Kabaeva: పుతిన్ చర్యలు ఆమె కొంప కొల్లేరు చేసేలా మారాయి. ఉన్న చోట ఉండలేక.. వేరేచోటకు వెళ్లలేక ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు తలెత్తాయి. ఆమే అలీనా కబయేవా. జిమ్నాస్ట్

ఆమే అలీనా కబయేవా.... జిమ్నాస్ట్, ఒలింపిక్స్ గోల్డ్‌మెడలిస్ట్‌ అయిన 38 ఏళ్ల ఈ అమ్మడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రేయసిగా భావిస్తుంటారు. అయితే పుతిన్ మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని ఎప్పుడూ ప్రకటించలేదనుకోండి. పుతిన్‌కు చెందిన యునైటెడ్‌ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించిన అలీనా.. ఎంపీగా ఆరేళ్ల పాటు పని చేశారు. ప్రస్తుతం నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డు చైర్‌పర్సన్‌గా గత ఏడేళ్ల నుంచి పని చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లో భారీ భద్రత మధ్య జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రతరం చేస్తుండటంతో స్విట్జర్లాండ్‌ నుంచి ఆమెను బహిష్కరించాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఛేంజ్‌. ఆర్గ్‌లో మూడు దేశాలకు చెందిన వారు పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఉక్రెయిన్, బెలారస్‌కు చెందిన వారితో పాటు రష్యావాసులు కూడా ఇందులో ఉండటం విశేషం. ఈ పిటిషన్‌కు అనుకూలంగా ఇప్పటివరకు 50  వేల మంది సంతకాలు చేశారు. మరోవైపు అలీనా కబయేవా, ఆమె సంతానాన్ని సురక్షితంగా ఉంచేందుకు పుతినే వారిని స్విడ్జర్లాండ్‌ లోని ఓ లగ్జరీ విల్లాకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: Nagababu on Niharika: నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేసింది నేనే..

Also Read: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. రీ ఎంట్రీ ఇస్తున్న హాట్ యాంకర్‌! ఇక పండగే పో!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More