Home> అంతర్జాతీయం
Advertisement

ముస్లిం దేశాల ప్రజల రాకపై నిషేధానికి ఒకే..!

అమెరికా అధ్యక్షుడు ఆరు ముస్లిం దేశాల ప్రజల రాకను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్ధించింది.

ముస్లిం దేశాల ప్రజల రాకపై నిషేధానికి ఒకే..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ఆరు ముస్లిం దేశాల ప్రజల రాకను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు సమర్ధించింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక కొన్ని రోజులకే చాద్, ఇరాన్, లిబియా, సిరియా, యెమెన్, సోమాలియా దేశాల ప్రజలు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే..! దాంతో ప్రజా సంఘాలు, మానవహక్కులు ట్రంప్ చర్యలపై దిగువ కోర్టుల్లో కేసు వేశారు. వారిని కొన్ని పాక్షిక సవరణలతో అమెరికాలో అనుమతించవచ్చని కోర్టు తీర్పు నిచ్చింది. దాంతో ట్రంప్ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లింది.

ఈ కేసును సుప్రీంకోర్టులో 9 మంది సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇందులో ఇద్దరు న్యాయమూర్తులు మాత్రమే అభ్యంతరం తెలిపినా... మొత్తానికి మెజార్టీ బెంచ్ మాత్రం ఆ ఆరు ముస్లిం దేశాల ప్రజల రాకపై నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయవచ్చని తెలిపింది. నిషేధం అమలయ్యాక ఏవైనా న్యాయపరమైన సమస్యలు తలెత్తితే కోర్టుల్లో పరిష్కరించుకొనే వెసలుబాటు కల్పించాలని సుప్రీం సూచించింది. అయితే ఇది తుది తీర్పుకాదు. ట్రంప్ సెప్టెంబర్ లో జారీచేసిన ఆదేశాలను హైకోర్టు ఇంకా ఆమోదించాల్సి ఉంది. వచ్చే ఏడాది సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.

Read More