Home> అంతర్జాతీయం
Advertisement

Indian in Ukraine Army: యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారత విద్యార్థి!

Indian in Ukraine Army: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చాలా మంది ఉక్రెయిన్ వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. కానీ ఓ భారత విద్యార్థి మాత్రం ఉక్రెయిన్ ఆర్మీలో చేరి.. రష్యాపై పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఆ యువకుడి వివరాలు ఇలా ఉన్నాయి.

Indian in Ukraine Army: యుద్ధ సమయంలో ఉక్రెయిన్ ఆర్మీలో చేరిన భారత విద్యార్థి!

Indian in Ukraine Army: తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఉక్రెయిన్​ ఆర్మీలో చేరి.. రష్యాపై పోరాటానికి సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆ యువకుడు రెండు సార్లు ప్రయత్నించగా.. విఫలమయ్యాడు.

తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సైనికేశ్​ రవిచంద్రన్​ జార్జియన్ నేషనల్ లెజియన్ పారామిలిటరీ యూనిట్​లో భాగంగా.. ఉక్రెయిన్ ఆర్మీలో వాలంటీర్​గా చేరాడని పేర్కొంది తమిళనాడు ప్రభుత్వం.

సైనికేశ్​ గురించి..

సైనికేశ్​ 2018లో ఖార్కీవ్​లోని ఇంజనీరింగ్​ నేషనల్​ ఎరోస్పేస్​లో ఎరోస్పేస్​ ఇంజనీరింగ్​ చదివేందుకు వెళ్లాడు. ఈ ఏడాది జులైతో ఈ కోర్స్​ ముగియనుంది.

ఇండియాలో ఇంటర్​మీడియట్​ (12వ తరగతి) ముగిసిన తర్వాత ఇండియన్​ ఆర్మీలో చేరేందుకు ప్రయత్నించినా సెలెక్ట్​ కాలేదు. అయినా తనకు ఆర్మీలో చేరాలనే కోరికను ఎలాగైనా నెరవేర్చుకోవాలని.. చెన్నైలోని అమెరికా కాన్సూలేట్ ద్వారా అమెరికా ఆర్మీలో చేరేందుదుకు కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీనితో సైనికేశ్​ ఎరోస్పేస్​ ఇంజినీరింగ్ అభ్యసించాలని నిర్ణయించుకున్నాడని తెలిసింది.

గత ఏడాది జులైలో ఇండియాకు వచ్చిన సైనికేశ్​ నెలన్నర పాటు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి ఉక్రెయిన్​ వెళ్లిపోయాడు.

ఇటీవల రష్యా-ఉక్రెయిన్​ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత సైనికేశ్​తో కుటుంబంతో కాంటాక్ట్​ కాలేదని తెలిసింది. దీనితో సైనికేశ్​కు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఉక్రెయిన్​లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించారు. ఎంబసీ సైనికేశ్ గురించి ఆరా తీయగా.. అతడు ఉక్రెయిన్ ఆర్మీలో చేరినట్లు చెప్పారు.

Also read: Exit Polls 2022: ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి, ఏ రాష్ట్రంలో ఎవరిది పైచేయి, యోగీ, కేజ్రీల క్రేజ్ పెరిగిందా

Also read: UP Exit Poll Results 2022: ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీదే హవా.. కానీ.. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెబుతున్నాయంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More