Home> అంతర్జాతీయం
Advertisement

మళ్లీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

మళ్లీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడుల నేపథ్యంలో ఈనెల 17 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. గత ఆరు రోజులుగా పెట్రోల్ ధర లీటరు రూ.1.58, డీజెల్ రూ.1.31 మేర పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారంనాడు లీటరు పెట్రోల్ 27 పైసల మేర పెరిగి రూ.73.62కు చేరింది. లీటర్ డీజిల్ ధర 18 పైసల మేర పెరిగి రూ.66.74కు చేరుకుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.79.29గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ70.01 పలుకుతోంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.52కి చేరుకోగా డీజిల్ ధర రూ. 70.56 గా ఉంది. ఇక కోల్‌కతాలో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.76.32, డీజిల్ ధర రూ.69.15 మార్కుని తాకినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఇరాక్ తర్వాత భారత్‌కు రెండో అతి పెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి అనంతరం ఈనెల 16న పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రోజువారీ సవరణలను చేస్తోంది. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకింత పెరుగుతూ వస్తున్నాయి. డ్రోన్ దాడుల తర్వాత పరిణామాలు ఎలా వున్నప్పటికీ.. భారత్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు చమురు సరఫరా జరిగి తీరుతుందని సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

Read More