Home> అంతర్జాతీయం
Advertisement

Papua New Guinea: పపువా న్యూ గినియాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ...


Earthquake in Papua New Guinea: పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది.

Papua New Guinea: పపువా న్యూ గినియాలో భారీ భూకంపం... సునామీ హెచ్చరిక జారీ...

Earthquake in Papua New Guinea: ఆగ్నేయాసియా దేశం పపువా న్యూ గినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. సునామీ విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే హెచ్చరిక జారీ చేసింది. 

పపువా న్యూ గినియాలోని తూర్పు భాగంలో ఈ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని తెలుస్తోంది. కైనంతు ప్రాంతానికి తూర్పు దిశగా 67 కి.మీ దూరంలో, భూమికి 60కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూ గినియా ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటు చేసుకుంటాయి. భౌగోళికంగా పపువా న్యూ గినియా ఉండే ప్రాంతాన్ని పసిఫిక్ రింగ్ ఫైర్‌గా పిలుస్తారు.ప్రపంచంలో 90 శాతం భూకంపాలు ఇక్కడే చోటు చేసుకుంటాయి.

ప్రతీ ఏటా రిక్టర్ స్కేలుపై 5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో 100కి పైగా భూకంపాలు ఇక్కడ సంభవిస్తుంటాయి. 2018లో ఈ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం ధాటికి 125 మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. 

Also Read: Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత

Also Read: Krishnam Raju Death: దిగ్గజ నటుడు కృష్ణంరాజు మరణంపై హీరోలు మంచు మనోజ్, నిఖిల్ రియాక్షన్..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More