Home> అంతర్జాతీయం
Advertisement

POK Protests: పీఓకేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. ముగ్గురి మృతి.. పోలీసులపై స్థానికుల మూకదాడి...

Pakistan: పాక్ ఆక్రమిత ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈనేపథ్యంలో స్థానిక ప్రజలు చేపట్టిన చలో ముజఫర్ బాద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి దాక ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది.

POK Protests: పీఓకేలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. ముగ్గురి మృతి.. పోలీసులపై స్థానికుల మూకదాడి...

Pakistan occupied kashmir violence strike enters 5 thday: పాకిస్థాన్ ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎన్నికల తర్వాత ఏర్పడిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఇప్పట్లో కష్టాలు తప్పేలాలేవు. పాక్ లో నిత్యావసారల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో.. అక్కడి ప్రజలు తమ నిరసనలు తెలియజేస్తున్నారు. పెట్రోల్ , డీజీల్ ధరలు, కూరగాయాలు ఇలా అన్ని రెట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో అక్కడి ప్రజలు ద్రవ్యొల్బణంతో అల్లాడిపోతున్నారు. ఇదిలా ఉండగా.. రోట్టేలు, విద్యుత్ లపై పన్నులు పెంచుతూ పాక్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేశారు. అసలే తినడానికి తిండిలేదని ఇబ్బందులు పడుతుంటే, ఈ పన్నుల బాదుడేంటనీ ప్రజలంతా ఏకమయ్యారు. అంతేకాకుండా.. గతశుక్రవారం నుంచి తమ నిరసలను తెలియజేస్తున్నారు.

Read more: MP Elections 2024: ఎన్నికల వేళ కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. ఇద్దరు భార్యలున్న వారికి కూడా ఆ పథకం.. వీడియో వైరల్..

చలో ముజఫరాబాద్ కార్యక్రమం చేపట్టారు. ఇది కాస్త హింసాత్మకంగా మారింది. పోలీసులు, ప్రజలపై దాడులకు తెగబడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నతమపై పోలీసులు దాడిచేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్యన అనేక సార్లు ఘర్షణ వాతావరణ నెలకొంది.ఈ పరిస్థితుల్లో.. సైన్యం కూడా పీఓకేకు చేరుకుంది. అమాయకులపై ఏకే 47 గన్ లతో కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో.. ఇద్దరు పౌరులు, ఒక పోలీసు సిబ్బంది మరణించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. దీనిపై పాక్ విద్యుత్ మంత్రి.. గొడవలపై పాక్ పీఎం షాబాజ్ షరీఫ్ తో చర్చలు జరిపారు. ప్రజల కోసం.. పాక్ 23 బిలియన్ల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా సంయమనం పాటించాలని పాక్ ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా.. పాక్ లో ప్రజలు కొన్నినెలలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతంగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో తినడానికి ఏది కూడా కొనలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇక మార్కెట్ లో ఏది ముట్టుకున్న, రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి.

Read more: Smell of Cooking Food: వంట స్మెల్ చూసి వావ్ అంటున్నారా..?.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎన్ఓఏఏ పరిశోధకులు..

పాక్ అనేక దేశాలతో వైరం పెట్టుకోవడం వల్ల ఎగుమతులు, దిగుమతులు లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనావస్థకు చేరిపోయింది. దీంతో ప్రజలు కొన్ని చోట్లు తిరుగుబాట్లు చేస్తున్నారు. ప్రజలకు వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా లేవని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇంకా.. సరైన విధంగా పాలన అందిచట్లేదని  పాక్ లోని నేతలు విమర్శిస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More