Home> అంతర్జాతీయం
Advertisement

భారత్‌లో మిసైల్స్ కన్నా.. గొప్పదాన్ని పాకిస్తాన్‌కి అమ్ముతాం: చైనా

చైనాలోని ఒక ప్రముఖ మీడియా కథనం ప్రకారం, భారత్‌లోని బ్రహ్మోస్ మిసైల్ కన్నా శక్తిమంతమైన సూపర్ సానిక్ మిసైల్‌ను పాకిస్తాన్‌కి చైనా విక్రయించనున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో మిసైల్స్ కన్నా.. గొప్పదాన్ని పాకిస్తాన్‌కి అమ్ముతాం: చైనా

చైనాలోని ఒక ప్రముఖ మీడియా కథనం ప్రకారం, భారత్‌లోని బ్రహ్మోస్ మిసైల్ కన్నా శక్తిమంతమైన సూపర్ సానిక్ మిసైల్‌ను పాకిస్తాన్‌కి చైనా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ మిసైల్ కన్నా.. చాలా తక్కువధరకే దీనిని తయారుచేసి పాకిస్తాన్ దేశానికి ఇస్తామని చైనా ప్రభుత్వం తెలిపినట్లు ఆ వార్తలో పేర్కొనడం జరిగింది. హెచ్ డీ1 అనేది అన్ని మిసైల్స్‌లా పనిచేయదని.. తక్కువ ఇంధనంతో ఎక్కువకాలం మన్నే సరికొత్త మిసైల్ అని గ్లోబల్ టైమ్స్ ఓ వార్తాకథనంలో తెలిపింది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్ దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయని.. ఆ ఒప్పందంలో భాగంగానే 48 డ్రోన్లను బీజింగ్ నుండి పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌కు పంపిస్తున్నామని చైనా తెలిపింది.

హెచ్ డీ1ను దక్షిణ చైనాకి చెందిన గుయాంగ్ డాంగ్ హోంగ్డా బ్లాస్టింగ్ కంపెనీ తయారుచేస్తుందని కూడా తెలియజేసింది.  ఇప్పటికే ఈ మిసైల్‌ను టెస్టింగ్ చేయడం జరిగిందని.. ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ అన్నీ కూడా బహుచక్కగా పనిచేస్తున్నాయని.. చైనా తెలిపినట్లు వార్తా కథనంలో పేర్కొనడం జరిగింది. ఉత్తర చైనాలో ఈ మిసైల్ టెస్టింగ్ జరిగినట్లు కూడా ఆ కథనంలో తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర మిసైల్స్ కన్నా.. తక్కువ ఇంధనంతో నడిచే అవకాశం హెచ్ డీ1కి ఉందని చైనా తెలిపింది.

మరో చైనా పత్రిక ఇదే అంశంపై మాట్లాడుతూ.. రష్యా, భారత్‌లు సంయుక్తంగా తయారుచేసిన బ్రహ్మోస్‌ కోసం ఎక్కువ ఖర్చు చేశారని తెలిపింది. అదే హెచ్ డీ1 విషయానికి వస్తే.. బ్రహ్మోస్ కన్నా తక్కువ ధరకు తయారయ్యే ఈ మిసైల్‌లో కమాండ్, కంట్రోల్, టార్గెట్ ఇండికేషన్ వంటి విషయాల్లో ప్రత్యేకతను చాటే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని కూడా తెలపడం జరిగింది. 

Read More