Home> అంతర్జాతీయం
Advertisement

పాక్ చేతిలో భారత ఫైటర్ పైలట్; వీడియో రిలీజ్ 

                                

పాక్ చేతిలో భారత ఫైటర్ పైలట్; వీడియో రిలీజ్ 

అభినందన్ పేరుతో ఓ వీడియోను పాక్ తన అధికార వెబ్ సైట్ ఉంచింది. ఇతను భారత యుద్ధ విమానమైన మిగ్ 21 పైలట్ అని.. తమ భూభాగంలో దాడికి పాల్పడుతున్న సమయంలో విమానాన్ని కుప్పకూల్చి అతన్ని అదుపులోకి తీసుకున్నమని పాక్ ప్రకటించింది. మరో పైలట్ కు తీవ్రగాయాలు పాలవడంతో అతన్ని ఆస్పత్రికి చేర్చినట్లు పాక్ పేర్కొంది.  

 

 

అయితే పాక్ తన అధికారిక వెబ్ సైట్ ఉంచిన ఈ వీడియోను గంట వ్వవధిలో డిలీట్ చేసింది. దీంతో అసలుఈ వీడియో నిజమైందా కాదా అనేది తేలాల్సి ఉంది. భారత్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే పాక్ ఇలాంటి వీడియోలు పెడుతుందా ? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. కాగా పాక్ చెబుతున్నట్లు మిగ్ విమానంలో నడిపిన వ్యక్తి అభినందనేనా అనే దానిపై విచారణ జరుగుతోంది. 

సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఇరుదేశాలకు చెందిన సైనికులు పరస్పరం దాడులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ యుద్ధ విమానాలు భారత్ భూభాగంలోకి ప్రవేశించేందుకు సాహసం చేయడంతో దాన్ని అడ్డుకునేందుకు భారత్ మిగ్ 21 మిమానాన్ని సంధించింది. పాన్ విమానాలను తరమివేసే క్రమంలో మిగ్ 21 విమానం పాక్ భూభాగంవైపు వెళ్లడం.. అది కాస్త కుప్పకూలడం లాంటి ఘటన చోటు చేసుకుంది. 

 

Read More