Home> అంతర్జాతీయం
Advertisement

Kim Jong Un: ఇదేక్కడి కర్కశత్వం.. వరదలను అడ్డుకోలేదని.. 30 మంది అధికారులకు మరణశిక్ష...

North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు ఎలాంటి నియంత పోకడలకు పోతారో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి, పైశాచీక నిర్ణయాల గురించి తరచు అనేక ఘటనలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఈ క్రమంలో మరో ఘోరం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
 

Kim Jong Un: ఇదేక్కడి కర్కశత్వం.. వరదలను అడ్డుకోలేదని.. 30 మంది అధికారులకు మరణశిక్ష...

North korea kim jong un orders executed 30 officials: నార్త్ కోరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరొసారి సంచలనంగా మారారు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వైరల్గా మారింది. గతంలో నార్త్ కోరియాలో వరదలు సంభవించి వేలాది మంది చనిపోయారు. భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. ఈ క్రమంలో సరైన విధంగా స్పందించలేదని, నిర్ణయాలు తీసుకోలేదని కూడా నార్త్ కోరియా నియంత.. ఏకంగా 30 మంది ప్రభుత్వ అధికారులకు ఆయన మరణ శిక్ష విధించారు. 

వరదలను అడ్డుకోలేదనే కోపంతో... ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా, అంతర్జాతీయ మీడియాలు పలు కథనాలను నివేదించాయి. ఇదిలా ఉండగా.. ఉత్తర కోరియా..ప్రజలకు ప్రతిసారి కిమ్ జోంగ్ ఉన్ చుక్కలు చూపిస్తుంటారు. ఆయన నిర్ణయాలు .. నియంతృత్వానికి పరాకాష్టగా  ఉంటాయి.  

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో వరదలు భారీ సంభవించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు స్టేట్స్ కూడా వర్షాలకు గజ గజ వణికిపోయాయి. ఇదిలా ఉండగా.. ఆయా ప్రభుత్వాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉండగా..   ఉత్తర కొరియాలోనూ భారీ వర్షాలు, వరదలు సంభవించాయి. అయితే.. విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కిమ్.. కఠిన చర్యలకు చేపట్టినట్లు తెలుస్తోంది.  

ఇదిలా ఉండగా.. అవినీతికి పాల్పడ్డారంటూ.. కూడా  20-30 మంది ప్రభుత్వ అధికారులకు గత నెల మరణశిక్ష విధించినట్లు దక్షిణకొరియా మీడియా ఓ కథనంలో ప్రచురించాయి. ఆతర్వాత వారికి మరణశిక్ష అమలు చేశారని కథనంలో పేర్కొంది. అయితే సదరు అధికారుల వివరాలు, శిక్ష, అమలు తదితర విషయాలపై క్లారిటీ రాలేదు. మరణ శిక్షకు గురైన వారిలో చాగాంగ్‌ ప్రావిన్స్‌ ప్రొవిన్షియల్‌ పార్టీ కమిటీ సెక్రటరీ కాంగ్‌ బాంగ్ హూన్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Read more: Bhadra rajayog 2024: భద్ర రాజయోగం.. ఈ రాశులవారిని డబ్బు వెతుక్కుంటూ వస్తోంది!..  మీరున్నారా..?

4 వేల మందికిపైగా బలి

ఉత్తరకొరియాలో జులై-ఆగస్టు మధ్యకాలంలో కుండపోతగా వర్షం కురిసింది. భారీగా ప్రాణ ,ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.  దాదాపు 4వేల మంది ప్రాణాలు కోల్పోపోయినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More