Home> అంతర్జాతీయం
Advertisement

North Korea: ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరం..! ఆంక్షలు కఠినతరం..!

North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి. 

North Korea: ఉత్తర కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కలవరం..! ఆంక్షలు కఠినతరం..!

North Korea Covid-19: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతున్నాయి. దీంతో కిమ్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆంక్షలను కఠినతరం చేసింది. వారం రోజుల కిందట అక్కడ తొలి కోవిడ్ కేసులు నమోదైంది. ఇప్పుడాక సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరినట్లు తెలుస్తోంది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల 62 వేల 270 కేసులు వెలుగు చూశాయి. కరోనా వల్ల ఒకరు చనిపోయారు. ఇప్పటివరకు వైరస్‌ బారిన పడి 63 మంది మృతి చెందారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. 
 
ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 1.98 మిలియన్ల మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 7 లక్షల 40 వేల 160 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. జ్వరం వల్లే దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిమ్ ప్రభుత్వం చెబుతోంది. ఐతే క్షేత్ర స్థాయిలో మాత్రం కేసులన్నీ ఒమిక్రాన్‌ వేరియంట్‌వని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో ఉత్తర కొరియా సర్కార్ ఒమిక్రాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటోంది. 

ఐతే కరోనా కేసులను ప్రభుత్వం దాచిపెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కిమ్ రాజకీయ జీవితంపై ప్రభావం పడకుండా చూసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్ విధించారు. కీలక నగరాలు, పట్టణాల్లో వైరస్ ఆంక్షలను రెట్టింపు చేశారు. సరిహద్దులను సైతం మూసివేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతోనే వైరస్‌ను కిమ్ ఎదుర్కొలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. 

ఉత్తర కొరియాలో వ్యాక్సినేషన్‌ను తీసుకురావాలన్న డిమాండ్ ఉంది. ఇప్పటివరకు టీకాలను పరిశీలించిన అక్కడి ప్రభుత్వం..వాటిని కొనుగోలు చేయలేదు. ఐక్యరాజ్య సమితి ఇస్తామన్న టీకా సహాయాన్ని కూడా కిమ్ ప్రభుత్వం వదులుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఇరుగుపొరుగుదేశాలు సైతం సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈక్రమంలో కిమ్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది.

Also read:చివరి బంతికి లక్నో ఊహించని విజయం.. హద్దులు దాటి సంబరాలు చేసుకున్న గౌతమ్ గంభీర్ (వీడియో)!

Also read:Supreme Court on GST: జీఎస్టీపై భారత సర్వోన్నత న్యాయ స్థానం కీలక తీర్పు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Read More