Home> అంతర్జాతీయం
Advertisement

Mc Donalds: టాయ్‌లెట్ వివాదంలో చిక్కుకున్న మెక్‌డోనాల్డ్స్ సంస్థ

Mc Donalds: ఒక్కొక్కసారి సదుద్దేశంతో చేసిన పనులే పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తోంది. సుప్రసిద్ధ మెక్‌డోనాల్డ్స్ సంస్థ విచిత్రమైన సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యేంటో తెలుసుకుందాం.

Mc Donalds: టాయ్‌లెట్ వివాదంలో చిక్కుకున్న మెక్‌డోనాల్డ్స్ సంస్థ

Mc Donalds: ఒక్కొక్కసారి సదుద్దేశంతో చేసిన పనులే పెద్ద పెద్ద వివాదాలకు దారి తీస్తోంది. సుప్రసిద్ధ మెక్‌డోనాల్డ్స్ సంస్థ విచిత్రమైన సమస్య వెంటాడుతోంది. ఆ సమస్యేంటో తెలుసుకుందాం.

సుప్రసిద్ధ రెస్టారెంట్ గ్రూప్ మెక్‌డోనాల్డ్స్(Mc Donalds) విచిత్రంగా టాయ్‌లెట్ సమస్యలో ఇరుక్కుంది. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే ఇది. మంచి ఉద్దేశ్యంతో తలపెట్టిన పనులే వివాదాలకు దారి తీస్తోంది. బ్రెజిల్‌లో సావో పాలో రాష్ట్రంలోని బౌరులో ఒక మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ రూపొందించిన యూనిసెక్స్ టాయ్‌లెట్‌ బాత్‌రూమ్‌ పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ యూనిసెక్స్‌ టాయిలెట్‌ రూమ్‌ను పురుషులు, స్త్రీలు ఇద్దరూ వినియోగించేలా మెక్‌డొనాల్డ్స్ రూపొందించింది. అయితే పురుషులు, స్త్రీలు వినియోగించేలా ఒకే విధమైన టాయ్‌లెట్‌ రూమ్‌ ఏంటంటూ ఓ మహిళ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కి ఫిర్యాదు చేశారు. పైగా చిన్నపిల్లలు కూడా వాటినే ఎలా వినియోగిస్తారంటూ ఘాటుగా ప్రశ్నిస్తున్న ఒక ఆడియో క్లిప్‌ను కూడా  ఆరోగ్య అధికారులకు పంపించారు .

దీంతో ఆరోగ్య అధికారులు రంగంలో దిగి..మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్‌ని సందర్శించారు. ఆరోగ్య నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ప్రజల ఆ‍రోగ్యం నిమిత్తమే కాకుడా అందరూ గుర్తించే విధంగా పురుషులకు, స్త్రీలకు వేర్వేరు టాయిలెట్‌ రూంలు ఉండాల్సిందేనని చెప్పారు. పైగా రెస్టారెంట్‌లో రెండు వారాలలోపు వేర్వేరు టాయిలెట్‌ రూంలు ఏర్పాటు చేయాలని..లేకపోతే మూసివేయడం, జరిమాన వంటి చర్యలు ఎదుర్కోవల్సి ఉంటుందంటూ అధికారులు హెచ్చరించారు. అయితే మెక్‌డొనాల్డ్స్‌ గౌరవార్థమే ప్రతిఒక్కరూ వినియోగించడానికి స్వాగతించేలా కొద్దిపాటు మార్పులతో ఈ బాత్రూంలు (Unisex Bathrooms)రూపొందించామన్నారు. అంతేకాకుండా నిర్థిష్ట ప్రమాణాలకు అనుగుణంగా అధికారులకు సహరికరిస్తామంటూ వివరణ ఇచ్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Also read: Snow leopards Corona: కరోనాతో మంచు చిరుతలు మృతి...ఎక్కడంటే...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More