Home> అంతర్జాతీయం
Advertisement

Ktr London Tour: తెలంగాణకు మరో మణిహారం..కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు..!

Ktr London Tour: లండన్‌లో మంత్రి కేటీఆర్ బృందం పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ సాగుతోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. తాజాగా ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.

Ktr London Tour: తెలంగాణకు మరో మణిహారం..కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు..!

Ktr London Tour: లండన్‌లో మంత్రి కేటీఆర్ బృందం పర్యటన కొనసాగుతోంది. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా టూర్‌ సాగుతోంది. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. కీలక అంశాలపై చర్చించారు. తాజాగా ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. హైదరాబాద్‌ ఫార్మా సిటీలో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధనలు, అకాడమిక్ వ్యవహారాల్లో ప్రభుత్వంతో కలిసి కింగ్స్‌ కాలేజీ పని చేయనుంది. 

మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌ రంజన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కింగ్స్ హెల్త్ పార్ట్‌నర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్‌లు సంతకాలు చేశారు. గతనెలలో కింగ్స్ కాలేజీ ప్రతినిధులు ..భారత్‌లో పర్యటించారు. ఈక్రమంలోనే లండన్‌లోని కింగ్స్ కాలేజీ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. తాజాగా కుదిరిన ఒప్పందంతో పరిశోధనలు, విద్యార్థుల బదలాయింపు, పాఠ్యాంశాల తయారీలో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజీ సహకరించనుంది. 

ఫార్మా సిటీ, లైఫ్‌ సైన్సెస్ అంశాల్లో కేసీఆర్ సర్కార్ విజన్‌కు తోడ్పాటును అందిస్తుందని కింగ్స్ కాలేజీ ప్రతినిధులు తెలిపారు. టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్య అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కింగ్స్ కాలేజీ లండన్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ షిట్జి కపూర్ చెప్పారు. తమ సంస్థ భారత్‌లోని చాలా సెంటర్లతో కలిసి పనిచేస్తోందని గుర్తు చేశారు. 

దీంతో  భారత్, యూకే సంబంధాలు మరింత బలోపేతం అయ్యిందన్నారు మంత్రి కేటీఆర్(KTR). హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారుబోతుందని చెప్పారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఏకో సిస్టమ్ విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. కింగ్స్ కాలేజీతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని..సీఎం కేసీఆర్ సైతం హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
 

Also read:Somuveer Raju Letter: ఏపీలో వరి మంటలు..సీఎం జగన్‌కు సోమువీర్రాజు లేఖాస్త్రం..!

Also read:Hyderabad Traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ మళ్లింపులు..ఎక్కడెక్కడో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More