Home> అంతర్జాతీయం
Advertisement

Jeff Bezos: టోర్నడో బీభత్సం..ఆరుగురు సిబ్బంది మృతి...గుండె పగిలిందన్న జెఫ్ బెజోస్

Tornado: అమెరికాలో టోర్నడోల ధాటికి అమెజాన్ సిబ్బంది ఆరుగురు మృతి చెందారు. తాజాగా ఈ ఘటనపై జెఫ్‌ బెజోస్‌ స్పందించారు.
 

Jeff Bezos: టోర్నడో బీభత్సం..ఆరుగురు సిబ్బంది మృతి...గుండె పగిలిందన్న జెఫ్ బెజోస్

US Tornado: అమెరికా(America)లో టోర్నడోలు(Tornado) సృష్టించిన బీభత్సానికి 70 మంది వరకు చనిపోయారు. ఈ టోర్నడోల ధాటికి కెంటకీ, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి.  ఈ బలమైన గాలుల తాకిడికి ఇల్లినాయిస్‌ రాష్ట్రం ఎడ్వర్డ్స్‌విల్లే(Edwardsville)లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ ధ్వంసమై...ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. తాజాగా ఈ సంఘటనపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌(Amazon chief Jeff Bezos) తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ...ట్వీట్ చేశారు. 

 ''ఎడ్వర్డ్స్‌విల్లే వార్త విషాదకరం. సహచరులను కోల్పోయామని తెలుసుకుని మా గుండె పగిలింది. ఈ సంక్షోభ సమయంలో అక్కడున్నవారందరికీ అమెజాన్ బృందం అండగా ఉంటుంది. అవిశ్రాంతంగా సహాయచర్యలు చేపడుతున్నవారికి కృతజ్ఞతలు'' అని ట్వీట్‌(Tweet)లో పేర్కొన్నారు బెజోస్. 

Also Read:US Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 50 మంది మృతి!

ప్రమాద సమయంలో అమెజాన్‌ వేర్ హౌస్(Amazon warehouse)లో నైట్ షిఫ్ట్‌లో దాదాపు 100 మంది ఉన్నట్లు సమాచారం. సహాయ చర్యలపై ఎడ్వర్డ్స్‌విల్లే అగ్నిమాపక అధికారి జేమ్స్ వైట్‌ఫోర్డ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 45 మందిని ఇక్కడి నుంచి సురక్షితంగా తరలించామని చెప్పారు. ఒకరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆరుగురు మృతి చెందినట్లు వెల్లడించారు.  మరోవైపు ఈ దుర్ఘటనపై దేశాధ్యక్షుడు జో బైడెన్‌(President Joe Biden) సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ‘'అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటి' అని వ్యాఖ్యానించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Linkhttps://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More