Home> అంతర్జాతీయం
Advertisement

కవరేజ్ పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లి పట్టుబడిన భారతీయ దొంగ జర్నలిస్టులు

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్ కవర్ చేయడానికి వచ్చామంటూ జర్నలిస్టుల ముసుగులో వెళ్లిన దొంగ జర్నలిస్టులు ఆస్ట్రేలియా బార్డర్ ఫోర్స్ చేతికి చిక్కారు. 

కవరేజ్ పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లి పట్టుబడిన భారతీయ దొంగ జర్నలిస్టులు

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరగనున్న కామన్‌వెల్త్ గేమ్స్ కవర్ చేయడానికి వచ్చామంటూ జర్నలిస్టుల ముసుగులో వెళ్లిన దొంగ జర్నలిస్టులు ఆస్ట్రేలియా బార్డర్ ఫోర్స్ చేతికి చిక్కిన ఘటన ఇది. ప్రముఖ న్యూస్ డైలీ ది గార్డియన్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం బ్రిస్‌బేన్ ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం 9 మంది భారతీయులని ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్ట తెలుస్తోంది. వారిలో రాకేశ్ శర్మ అనే వ్యక్తి మిగతా 8 మందికి నకిలీ అక్రెడిటేషన్ పత్రాలు సృష్టించి వారిని ఆస్ట్రేలియాకు తీసుకొచ్చినట్టు ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రాకేశ్ శర్మను ఆస్ట్రేలియా పోలీసులు గురువారం బ్రిస్‌బేస్ కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయంలో రాకేశ్ కుమార్ శర్మ నేరం రుజువయినట్టయితే.. హ్యూమన్ ట్రాఫికింగ్, అక్రమ చొరబాటు, ఫోర్జరీ వంటి చట్టాల ప్రకారం అతనికి 20 సంవత్సరాలు శిక్షపడే అవకాశం ఉందని సమాచారం. 

ఈ ఘటన అనంతరం ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం ఆస్ట్రేలియాకు చేరుకుంటున్న విజిటర్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. ఆస్ట్రేలియాకు బయల్దేరడానికి ముందే అన్నిరకాల పత్రాలు సరిచూసుకుని తమ తమ దేశాల్లో విమానం ఎక్కాల్సిందిగా ఆస్ట్రేలియన్ బార్డర్ ఫోర్స్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 

Read More