Home> అంతర్జాతీయం
Advertisement

భారత్ వద్ద పాక్ వ్యహాన్ని దెబ్బకొట్టే కొత్త అస్త్రం

భారత్ వద్ద పాక్ వ్యహాన్ని దెబ్బకొట్టే కొత్త అస్త్రం

భార‌త్ ప‌ట్ల విషం క‌క్కుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్ బుద్ది చేప్పేందుకు మోడీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ చర్యలో భాగంగా పాకిస్థాన్‌ వెన్నువిరిచే వ్యూహానికి భారత్ పదును పెడుతోంది. సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే సబ్‌మెరైన్ల జాడ‌ను పాక్‌ ప‌సిగ‌ట్టకుండా పి-3సీపై భారత్ దృష్టి పెట్టింది. జపాన్ తో కలిసి ఈ విన్యాసానాలకు చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ విన్యాసాలతో పాక్ కు వణుకుపుడుతోంది. 

సముద్ర తీరాల్లో జరిగే యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే అత్యుత్తమ స్థాయి సబ్‌మెరైన్లను భార‌త్ ఎప్పుడో సమకూర్చుకుంది. అయితే.. వాటిని గుర్తించి ధ్వంసం చేసే అమెరికాలోకి లాక్‌హీడ్‌ మార్టీన్‌ నుంచి పి-3సీ విమానాన్ని 1996లో పాకిస్థాన్ కొనుగోలు చేసింది. పాక్ రక్షణ దశం ఈ విమానాలను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేయిస్తూ వ‌స్తోంది. ఈ విమానాలకు స‌మాచారం అంద‌కుండా సబ్‌మెరైన్లను అప్‌గ్రేడ్‌ చేసుకునే పనిలో పడింది భారత్. పాక్ వద్ద ఉన్న పి-3సీలోని వ్యవస్థల పనితీరు తెలుసుకుని దానికి తగినట్లు సబ్‌మెరైన్ల సంచారాన్ని మార్చుకోవాలని భారత నేవీప్లాన్ వేసింది. జపాన్‌తో కలిసి సంయుక్త దీనికి సంబంధించిన యుద్ధ విన్యాసాలు చేసింది. జపాన్‌ కూడా పి-3సీ నిఘా విమానాలను వినియోగిస్తుండ‌డంతో యుద్ధ విన్యాసాల్లో భాగంగా వాటిని భారత సిబ్బంది కూడా వినియోగిస్తారు.

తాజా విన్యాసాలతో  పి-3సీపై భారత సిబ్బందికి పట్టువచ్చింది. ఈ విమానాలు గోవాలోని ఐఎన్‌ఎస్‌ దళం హంసాకి చేరుకున్నాయి. భారత్‌ తరపున పీ-8ఐ నిఘా విమానాలు ఈ విన్యాసాల్లో పాలు పంచుకున్నాయి. భార‌త స‌బ్‌మెరైన్ల క‌ద‌లిక‌ల‌ను పాక్ కనిపెట్టకుండా చేసేలా భారత నావికాదళం చర్యలు తీసుకుంటోంది. భారత్ అనుసరిస్తన్న వ్యహానికి ఎలా చెక్ పెట్టాలో తెలియక తికమకపడుతోంది పాక్...

Read More