Home> అంతర్జాతీయం
Advertisement

Indonesia: ఇండోనేషియాలో భారీ వరదలు, 44 మంది మృతి

Indonesia: ఇండోనేషియాలో భారీ వర్షాలు పెను విపత్తు సృషిస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడటంతో 44 మంది మరణించారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

Indonesia: ఇండోనేషియాలో భారీ వరదలు, 44 మంది మృతి

Indonesia: ఇండోనేషియాలో భారీ వర్షాలు పెను విపత్తు సృషిస్తున్నాయి. కొండ చరియలు విరిగి పడటంతో 44 మంది మరణించారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

ఇండోనేషియాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో 44 మంది మృతి చెందారు. వేలాదిమంది నిరాశ్రయులయినట్టు జాతీయ విపత్తు సహాయ సంస్థ తెలిపింది. చాలామంది గల్లంతయ్యారు. తూర్పు నెసా తెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో అర్ధరాత్రి దాటిన తరువాత ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ శిధిలాల కింద 38 మంది మృతదేహాల్ని, ఐదుగురు క్షతగాత్రుల్ని గుర్తించి బయటకు తీశారు. 

మరోవైపు తూర్పు ఇండోనేషియా ( Indonesia) లోని ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో 40 ఇళ్లు ధ్వంసమవడంతో ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా ఇళ్లు మునిగిపోవడంతో చాలామంది ఇళ్లు విడిచి పారిపోయారు. ఇండోనేషియాలో ప్రతియేటా భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం ( Landslides), వరదలు ( Floods) సంభవిస్తూనే ఉంటాయి. ఇండోనేషియా అనేక ద్వీపాల సమూహం కావడంతో మిలియన్ల కొద్దీ ప్రజలు పర్వత ప్రాంతాల్లో లేదా సారవంతమైన మైదాన ప్రాంతాల్లో నివాసముంటుంటారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారీ పెద్దసంఖ్యలో నష్టం జరుగుతుంటుంది.

Also read: COVID-19 Vaccine: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకుని రక్తం గడ్డకట్టడంతో ఏడుగురు మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More