Home> అంతర్జాతీయం
Advertisement

Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో అందరిని ఫూల్ చేసిన అమ్మాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

ఆన్‌లైన్ క్లాసుల సమయంలో, పిల్లలు తరచుగా కెమెరా ఆపేయటం,  ఆడియో మ్యూట్ చేయడం వంటివి చేస్తుంటారు, కొంత మంది నిద్ర పోతుంటారు. ఇలాంటి ఫోటో ఒకటి నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. 

Viral Photo: ఆన్‌లైన్ క్లాస్‌లో అందరిని ఫూల్ చేసిన అమ్మాయి.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Viral Photo: కొన్ని రకాల వీడియోలు, ఫోటోలు తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ (Viral) అవుతుంటాయి. కొన్ని  సంతోషపరిస్తే.. మరి కొన్ని షాక్ కు గురి చేస్తుంటాయి. ఇంటర్నెట్ లో ఎలాంటి వీడియో ఫోటోలు అయిన కారణం లేకుండా వైరల్ అవుతాయని మరో ఫోటో నిరూపించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్ లైన్ లో అన్ని.. నేర్చుకోవటం, ఫుడ్ ఆర్డర్, నిత్యావసర వస్తువుల కొనుగోలు.. ఇలా అన్నిటికి ఉన్న ఒకే ఒక మార్గం ఆన్ లైన్ (Online). 

టీచర్ లను మోసం చేసిన అమ్మాయి...
ఆన్‌లైన్ క్లాస్‌ల్లో విద్యార్థులు చాలా సౌకర్యవంతంగా ఉండవచ్చు, కానీ కొంత మంది విద్యార్థులు దీనిని తప్పుదోవలో వాడుతున్నారు. ఒక అమ్మాయి ఆన్‌లైన్ క్లాస్‌ (Online Class) డుమ్మా కొట్టి, ఒక బొమ్మకు మాస్క్, విగ్ పెట్టి లాప్ టాప్ ముందు ఉంచి తను వెళ్లి బెడ్ పై పడుకునే ఒక ఫోటో ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది.

Also Read: IPL 2021: రేపటి నండే ఐపీఎల్ రెండోదశ... ఎంటర్టైన్మెంట్ షురు!

తరగతి గదిలో విద్యార్థులకు నిద్ర వచ్చిన వారు పక్కన ఉన్న పిల్లలను లేదా టీచర్ తిడతారన్న భయంతో పడుకోకుండా క్లాసులు వింటున్నట్టు నటిస్తారు. కానీ ఆన్ లైన్ క్లాసులో ఏకంగా ఒక డమ్మీ బొమ్మను ఉంచి క్లాసు చెప్తున్న టీచర్ నే కాదు ఇతర విద్యార్థులను ఫూల్ చేసింది. 

మంచం మీద పడుకున్న అమ్మాయి
ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయింది. ఈ ఫోటోలో అమ్మాయి ఒక డమ్మీ బొమ్మకు మాస్క్, అద్దాలు తొడిగి, విగ్ పెట్టి లాప్ టాప్ మూడు పెట్టి పక్కన పడుకుంది. ఈ ఫోటోకు ఇప్పటివరకు 62.1K కంటే ఎక్కువ రీట్వీట్లు, 7392 వ్యాఖ్యలు మరియు 524.1K లైక్‌లు వచ్చాయి. "ఇంట్లో క్లాస్ సమయంలో మాస్క్ అవసరం ఏమిటి' అని ఒకరు కామెంట్ చేస్తే... "బ్రేవ్ గర్ల్" అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. 

Also Read: High Courts New Chief Justices: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు, ఏపీకి ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా?

చాలా మంది విద్యార్థులు ఇలా ఆన్‌లైన్ క్లాస్‌ల్లో టీచర్ లను మోసం చేస్తున్నారు. కావున మీ పిల్లలు అయిన సరిగా క్లాస్ వింటున్నారా? లేదా అని ఒకసారి check చేసుకోండి మరీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Read More