Home> అంతర్జాతీయం
Advertisement

TRUTH Social: ఫేస్​బుక్​, ట్విట్టర్​లకు షాక్​.. 'ట్రూత్​ సోషల్'​ పేరుతో ట్రంప్ సొంత సోషల్​ నెట్​వర్క్​

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అనుకున్నంత పని చేశారు. తనపై నిషేధం విధించిన సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ ట్విట్టర్​, ఫేస్​బుక్​కు పోటీగా సొంత నెట్​వర్క్​ను తీసుకురానున్నారు.

TRUTH Social: ఫేస్​బుక్​, ట్విట్టర్​లకు షాక్​.. 'ట్రూత్​ సోషల్'​ పేరుతో ట్రంప్ సొంత సోషల్​ నెట్​వర్క్​

TRUTH Social: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సొంతగా సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ను (Trump Own Social media) ప్రారంభించనున్నారు. గత కొంత కాలంగా ఈ విషయంపై ఊహాగానాలు వస్తుండగా.. తాజాగా వాటిని నిజం చేస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. ట్రంప్ మీడియా అండ్​ టెక్నాలజీ గ్రూప్​ (టీఎంటీజీ).. మరో కంపెనీ కలిసి సంయుక్తంగా కొత్త సోషల్ మీడియా నెట్​వర్క్​ను ప్రారంభించనున్నాయి. 'ట్రూత్​ సోషల్​' పేరుతో ఈ కొత్త సోషల్​ మీడియా నెట్​వర్క్​ను ఆవిష్కరించనున్నట్లు ఇరు సంస్థలు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశాయి.

పరిమిత సంఖ్యలో యూజర్లతో వచ్చె నెలలో బీటా వెర్షన్​ను విడుదల చేసేందుకు టీఎంటీజీ కసరత్తు చేస్తోంది. బీటా వెర్షన్​లో ఆశించిన ఫలితాలు వస్తే.. 2022 తొలి త్రైమాసికంలో పూర్తి స్థాయిలో ట్రూత్ సోషల్​ అందుబాటులోకి రావచ్చని సమాచారం.

ట్రూత్​ సోషల్​ ద్వారా ప్రతి ఒక్కరు తమ భావాలను పంచుకోవచ్చని ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్​ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బడా సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​ ఉన్నది ఉన్నట్లుగా చెప్పవారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఆరోపించారు.

Read Also: దేశవ్యాప్తంగా ఆల్​టైం హైకి పెట్రోల్ రేట్లు- ప్రస్తుత ధరలు ఇవే..

ట్రంప్ సొంత నెట్​వర్క్ తెచ్చేందుకు కారణాలివే..

ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు సోషల్​ మీడియాలో నిత్యం యాక్టివ్​గా ఉండేవారు. చాలా విషయాలపై ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో స్పందించేవారు. ఆయన చేసే పోస్ట్​లు పలుమార్లు వివాదాస్పదమయ్యాయి.

ఇదిలా ఉండగా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం.. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో ట్రంప్ పాత్ర ఉందంటు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్​లపై కూడా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో.. ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజాలు ఫేస్​బుక్​, ట్విట్టర్​ వంటి సంస్థలు ట్రంప్ ఖాతాలపై నిషేధం విధించాయి. దీనితో దాదాపు 9 నెలలుగా సోషల్​ మీడియాకు దూరమయ్యారు ట్రంప్. అందుకే సొంత నెట్​వర్క్ ద్వారా సోషల్​ మీడియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: అనన్య పాండే నివాసంలో ఎన్సీబీ సోదాలు.. సమన్లు జారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More