Home> అంతర్జాతీయం
Advertisement

Viral video: కూతురు తలమీదే సీసీ కెమెరాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వైరల్ గా మారిన వీడియో..


CCTV On Daughter's Head: యువతి తల మీద ఆమె తండ్రి  సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు.

Viral video: కూతురు తలమీదే సీసీ కెమెరాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.. వైరల్ గా మారిన వీడియో..

father installed cctv camera on daughters head for safety video: ప్రస్తుతం సమాజంలో మహిళల భద్రత పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఇంటి నుంచి బైటకు వెళ్లిన అమ్మాయిలు..తిరిగి వచ్చే వరకు కూడా టెన్షన్ గా మారింది. గుడి, బడి, బస్టాండ్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ కూడా భద్రత లేదని చెప్పుకొవచ్చు. ఇటీవల కాలంలో అనేక చోట్ల అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కామాంధులు మహిళలు కన్పిస్తే చాలు.. వెకిలి చెష్టలతో రెచ్చిపోతున్నారు.

 

 

కొన్ని చోట్ల వావి వరసలు మర్చిపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నలు,  కన్న తండ్రి సైతం.. తమ బిడ్డలపై అత్యాచారానికి ఒడిగట్టినఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తమ తండ్రులు..తమ బిడ్డలు ఇంటి నుంచి బైటకు వెళితే.. పదే పదేఫోన్ లు చేసుకుంటూ, వారి వివరాలు అడుగుతుంటారు. పొరపాటున ఆలస్యమైన, ఫోన్ కాల్ ఎత్తకున్న కూడా తెగ టెన్షన్ పడిపోతుంటారు.ఈ క్రమంలో.. ఒక తండ్రి తన బిడ్డ సెఫ్టీ కోసం వెరైటీగా ఆలోచించాడు. ఈ వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాకిస్థాన్ కు చెందిన ఒక తండ్రి.. తన బిడ్డ సెక్యురిటీ కోసం తెగ టెన్షన్ పడిపోయాడు. సమాజంలో జరుగుతున్న ఘటనలపై.. తనకూతురును కాపాడుకోనేందుకు వెరైటీగా ఆలోచించాడు. అతను..ఎక్కడికి వెళ్లిన, బాగానే ఉందా.. ఆమె నిరంతరం తమ కళ్లముందే ఉండేలాగా ఆమె తలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఆమెఎక్కడికి వెళ్లింది.. ఏంచేస్తుందనే దానిపై నిఘాపెట్టేందుకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.

అయితే.. సదరు యువతి సైతం.. తండ్రికి ఉన్న ప్రేమను చూసి సంతోష పడుతుంది. తన తండ్రికి తన మీద ఎంతో ప్రేమ అని.. సమాజంలో జరుగుతున్నఘటనలు చూసి ఆయన ఈ పనిచేశారని కూడా చెప్పుకొచ్చింది. 24/7 తన కూతురుని ఇంట్లో కూర్చుని..  పర్యవేక్షించడానికి అతను సీసీ కెమెరాను అమర్చినట్లు వెల్లడించింది.

Read more: kalki 2898: కల్కి మేనియా.. అశ్వత్థామగా గణపయ్య.. కాంప్లెక్స్ లాంటి సెట్టింగ్.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..

ఈ విషయంపై సదరు యువతి కూడా తన తండ్రికే సపోర్ట్ చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం ఇదేం సీసీటీవీలు బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. సమ్ థింగ్ ఇజ్ ఫిషీ.. అంటూ కామెంట్ లు చేస్తున్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More