Home> అంతర్జాతీయం
Advertisement

International Flights Ban: సెప్టెంబరు 30 వరకు నిషేధం పొడిగింపు

కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలా రంగాలపై పడింది. అయితే కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

International Flights Ban: సెప్టెంబరు 30 వరకు నిషేధం పొడిగింపు

DGCA extentds international flights ban: న్యూఢిల్లీ‌: కరోనావైరస్ (Coronavirus) ప్రభావం చాలా రంగాలపై పడింది. అయితే కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం సర్క్యూలర్‌ను విడుదల చేసింది. అయితే కార్గో విమానాల‌కు ఈ సర్క్యూలర్ వర్తించదని కేంద్ర విమానయాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అంతేకాకు డీజీసీఏ అనుమ‌తి ఉన్న విమానాల‌కు కూడా ఈ నిబంధ‌న వ‌ర్తించ‌దు. ఎంపిక చేసిన రూట్ల‌లో మాత్రం అధికారిక అనుమ‌తి పొందిన అంత‌ర్జాతీయ విమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) వెల్లడించింది. Also read: Prashant Bhushan Fined: ప్రశాంత్ భూషణ్‌కు రూ.1 జరిమానా.. చెల్లించకపోతే మరి!

అయితే విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ ద్వారా ప్రయణికులను స్వదేశానికి తీసుకువస్తున్న విసయం తెలిసిందే. అయితే సెప్టెంబ‌ర్ ఒక‌టో తేదీ నుంచి 31 వ‌ర‌కు ఆర‌వ ద‌శ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నట్లు విమానయాన శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.   Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర    

Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు

Read More