Home> అంతర్జాతీయం
Advertisement

Corona New Variant: మళ్లీ కరోనా భయం, ఇండోనేషియాలో బయటపడ్డ కొత్త వేరియంట్

Corona New Variant: కరోనా వైరస్. రెండేళ్లు ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి. ఇక కరోనా భయం లేదనుకుని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఈలోగా ఇండోనేషియా నుంచి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. మళ్లీ ముప్పు తప్పదా అనే ఆందోళన వ్యక్తమౌతోంది.

Corona New Variant: మళ్లీ కరోనా భయం, ఇండోనేషియాలో బయటపడ్డ కొత్త వేరియంట్

Corona New Variant: ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని మృత్యువాతకు గురి చేసిన కరోనా వైరస్ దాదాపుగా తుడుచుకుపెట్టుకుపోయినట్టుంది. గ్లోబల్ ఎమర్జెన్సీ కేటగరీ నుంచి కూడా కరోనా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలగించింది. అయితే ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ ఆందోళన కల్గిస్తోంది. ఏడాదిగా లేని కరోనా ఇప్పుడు మళ్లీ భయపెట్టడానికి కారణాలేంటో తెలుసుకుందాం..

కరోనా వైరస్. ప్రపంచాన్ని రెండేళ్లు భయపెట్టిన పదం. అత్యంత భయంకరమైన వ్యాధి. లక్షలాదిమంది మరణించారు. అయితే ఏడాదిగా కరోనా వైరస్ దాఖలాల్లేవు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కరోనా వైరస్‌ను గ్లోబల్ ఎమర్జెన్సీ నుంచి తొలగించింది. కోవిడ్ దాదాపుగా ముగిసిన అధ్యాయమని అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కోవిడ్ మరోసారి భయపెట్టేందుకు సిద్దమైంది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ కనుగొన్నారు. కరోనా సెకండ్ ఫేజ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ కంటే 113 రెట్లు ఉత్పరివర్తనం చెందిందిగా తేలింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కంటే ప్రమాదకరమని తెలుస్తోంది. 

ఈ వేరియంట్‌కు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతం ఇండోనేషియాలో ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దీనిని గురించి ప్రమాద తీవ్రత గురించి ఇంకా స్పష్టత రావల్సి ఉంది. అయితే ఈ ఉత్పరివర్తనం సాధారణమైందేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. మనిషికి ఈ కరోనా వైరస్‌తో పెద్ద ప్రమాదం లేదంటున్నారు ఐఎంఏ వైద్యులు. వ్యాక్సినేషన్ తీసుకున్నవారికి ఇలాంటి వైరస్‌ల వల్ల హాని ఉండదంటున్నారు. 

Also read: World Largest Cemetery: ప్రపంచంలో అతి పెద్ద శ్మశానమిదే, ఇక్కడ ఖననం కోసం ప్రార్ధనలు చేస్తుంటారంటే నమ్ముతారా

\స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More