Home> అంతర్జాతీయం
Advertisement

China lockdown: చైనాను కలవర పెడుతున్న కరోనా కేసులు- ఆ నగరాల్లో లాక్​డౌన్​!

China lockdown: కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కట్టడి చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. షాంఘైలో దశల వారీగా లాక్​డౌన్​కు సిద్ధమైంది. మరో నగరంలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలపై ఆంక్షలు విధించింది.

China lockdown: చైనాను కలవర పెడుతున్న కరోనా కేసులు- ఆ నగరాల్లో లాక్​డౌన్​!

China lockdown: చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక యంత్రాంగం లాక్​డౌన్​పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో దశల వారీగా లాక్​డౌన్ విధించేందుకు సిద్ధమైందని వార్తా సంస్థ ఏఎఫ్​పీ పేర్కొంది. ప్రస్తుతం చైనాలో.. కోరనా మహమ్మారి ప్రారంభమైనప్పుపి పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నట్లు తెలిపింది.

షాంఘైలో గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా.. షాంఘైలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్​డౌన్​ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షాంఘైలో దాదాపు 1.7 కోట్ల మంది జనాభా ఉంటారని ఓ అంచనా.

ఇక మరో కీలక నగరమైన షెన్​ జెన్​లో కూడా లాక్డౌన్ పరిస్థితులు తలపిస్తున్నాయి. వారం రోజులపాటు.. షెన్​జెన్​ నుంచి సమీప గ్రామాలకు రవాణాపై ఆంక్షలు విధించింది. ఇక మెట్రో సేవలు కూడా రద్దు చేసిందని చైనా అధికారిక మీడియా కథనాలు ప్రచురించింది. ఫిబ్రవరి చివరి నుంచి ఇక్కడ కేసులు క్రమంగా పెరుగుతూ రాగా.. ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. దీనితో కట్టడి చర్యలు ప్రారంభించింది.

ఈ మేరకు ప్రజలకు కూడా కీలక సూచనలు జారీ చేశాయి స్థానిక యంత్రాగాలు. అవసరమైతే తప్పా ఎవరూ బయటకు రావద్దని సూచించాయి. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించాయి. అత్యవస సేవలు, అత్యవసర పనులు ఉన్న వారు మాత్రమే బయటకు రావాలని ఆదేశించింది.

Also read: Video: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించే ఉత్తర కొరియా వీడియో.. స్టైలిష్‌గా కిమ్ జోంగ్ ఉన్...

Also read: Oscar Awards 2022: ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో జెలెన్ స్కీ ప్రసంగం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More