Home> అంతర్జాతీయం
Advertisement

Sinovac Vaccine: చైనా వ్యాక్సిన్ సినోవాక్‌కు అంతర్జాతీయ అత్యవసర అనుమతి

Sinovac Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరో వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునేందుకు ఆ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులిచ్చింది. వ్యాక్సిన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలున్నాయని వెల్లడించింది.

Sinovac Vaccine: చైనా వ్యాక్సిన్ సినోవాక్‌కు అంతర్జాతీయ అత్యవసర అనుమతి

Sinovac Vaccine: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మరో వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునేందుకు ఆ వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర అనుమతులిచ్చింది. వ్యాక్సిన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలున్నాయని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతానికి ఒక్కొక్కటిగా వ్యాక్సిన్‌(Vaccine)లు అందుబాటులో వస్తున్నాయి. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుట్నిక్ వి (Sputnik v )వ్యాక్సిన్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో వ్యాక్సిన్ అందుబాటులో వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్‌ను వినియోగించుకునేందుకు అనుమతిచ్చింది. చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ తయారు చేసిన సినోవాక్ (Sinovac vaccine) కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతిచ్చింది. అంతర్జాతీయ అనుమతి పొందిన రెండవ చైనా వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే సైనోఫార్మా వ్యాక్సిన్‌కు అంతర్జాతీయ అనుమతులు పొందింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నందునే అనుమతులిచ్చినట్టు డబ్లూహెచ్వో ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత (Vaccine Shortage) ఏర్పడిన నేపధ్యంలో ఇంకా చాలా వ్యాక్సిన్ల అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది. కోవ్యాక్స్ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లు అందించాల్సిందిగా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రాల్ని డబ్ల్యూహెచ్‌వో(WHO) కోరింది. కోవ్యాక్స్ ద్వారా పేదదేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందుతోంది. 

Also read: Bird flu in human: చైనాలో మనిషికి బర్డ్ ఫ్లూ.. మళ్లీ చైనాలోనే ఫస్ట్ కేసు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More