Home> అంతర్జాతీయం
Advertisement

Brain Aneurysm: బ్రెయిన్ ఎన్యూరిజమ్‌తో బాధపడుతున్న జిన్‌పింగ్, ఎంతవరకూ ప్రమాదకరమిది

Brain Aneurysm: ఇంట్రాక్రానియల్ ఎన్యూరిజమ్. అంటే బ్రెయిన్ ఎన్యూరిజమ్. ప్రమాదకరమైన, అరుదైన వ్యాధి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. ఆ వ్యాధి ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం..

Brain Aneurysm: బ్రెయిన్ ఎన్యూరిజమ్‌తో బాధపడుతున్న జిన్‌పింగ్, ఎంతవరకూ ప్రమాదకరమిది

Brain Aneurysm: ఇంట్రాక్రానియల్ ఎన్యూరిజమ్. అంటే బ్రెయిన్ ఎన్యూరిజమ్. ప్రమాదకరమైన, అరుదైన వ్యాధి. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు. ఆ వ్యాధి ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెయిన్ ఎన్యూరిజమ్‌నే మరో మాటలో సెరెబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ ఎన్యూరిజమ్ అని పిలుస్తారు. బ్లడ్ వెస్సెల్ వాల్‌లో అంతర్గత పొర బలహీనమైనప్పుడు అసాధారణ ఫోకల్ ఆర్టియరీ డైలేషన్ తలెత్తుతుంది. ఇదే ఎన్యూరిజమ్‌కు కారణమౌతుంది. 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రస్తుతం సెరెబ్రల్ ఎన్యూరిజమ్‌తో బాధపడుతున్నారు. గత ఏడాది చివర్లో ఆసుపత్రిపాలయ్యారు. కోవిడ్ 19 ప్రారంభమైనప్పటి నుంచి విదేశీ నేతలతో సమావేశాల్ని దూరం పెట్టడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది. జిన్‌పింగ్‌‌‌కు ఎదురైన సెరెబ్రల్ ఎన్యూరిజమ్ అత్యంత ప్రమాదకరమైందే కాకుండా ప్రాణాంతమైంది. అయితే సర్జరీ ద్వారా బ్లడ్ వెస్సెల్స్‌ను మృదువగా చేసి ఎన్యూరిజమ్ తగ్గించవచ్చు. కానీ జిన్‌పింగ్ అలా చేయకుండజా చైనా సాంప్రదాయ వైద్యాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. 

సెరెబ్రల్ లేదా ఇంట్రాక్రానియల్ ఎన్యూరిజమ్

బ్లడ్ వెస్సెల్స్ వాల్‌కు ఉండే అంతర్గత మస్క్యులర్ పొర బలహీనమైనప్పుడు అసాధారణ ఆర్టియరీ ఫోకల్ డైలేషన్ సంభవిస్తుంది. దీన్నే ఇంట్రాక్రానియల్ ఎన్యూరిజమ్ అంటారు. ఫలితంగా వెస్సెల్స్ అంతర్గతంగా డ్యామేజ్ అవుతుంది. ఫలితంగా బ్రెయిన్ చుట్టూ బ్లీడింగ్ అవతుుంది. దీన్నే హెమరేజ్ అని పిలుస్తారు. ఇదొక రకమైన బ్రెయిన్ హెమరేజ్. ఫలితంగా స్ట్రోక్స్, కోమా లేదా మరణం సంభవించవచ్చు.

సెరెబ్రల్ ఎన్యూరిజమ్ జిన్‌పింగ్‌లో ఎప్పుడు బయటపడింది

2019 మార్చ్ నెలలో జిన్‌పింగ్ ఇటలీ పర్యటన సందర్బంగా తొలిసారిగా అతని నడకలో తేడా అంటే నడక కుంటుపడటం గమనించారు. ఆ తరువాత ఫ్రాన్స్ పర్యటనలో కూడా కూర్చునేటప్పుడు సపోర్ట్ తీసుకోవడం గమనించారు. అదే సమయంలో 2020 షాంఘైలో బహిరంగసభలో కూడా అతని వైఖరి, నెమ్మదిగా మాట్లాడటం, దగ్గు వంటి లక్షణాలు బయటపడ్డాయి.

జిన్‌పింగ్ ఆరోగ్య పరిస్థితి

ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సరఫరాలో ఇబ్బందులు ఏర్పడి..ఇంధన, గ్యాస్ ధరల విపరీతంగా పెరిగాయి. ఫలితంగా చైనా ఆర్ధిక పరిస్థితి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. ఈ క్రమంలో చైనా మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు జిన్‌పింగ్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని భావిస్తున్నారు. మరి ఎన్యూరిజమ్ కారణంగా ఆరోగ్యం ఎంతవరకూ సహకరిస్తుందనేది అనుమానమే. ఇప్పటికే జిన్‌పింగ్ మూడు సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 

Also read: Srilanka Crisis: లంక అల్లకల్లోలం... కనిపిస్తే కాల్చిపారేయాలంటూ సైన్యానికి అధ్యక్షుడి ఆదేశాలు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More