Home> అంతర్జాతీయం
Advertisement

Chadwick Boseman: అస్తమించిన బ్లాక్ పాంథర్ చాడ్విక్ బోస్మాన్

బ్లాక్ పాంథర్ మూవీతో వసూళ్ల వర్షం కురిపించిన నటుడు చాడ్విక్ బోస్మాన్ ( Chadwick Boseman ) కన్నుమూశారు. 43 సంవత్సరాల చాడ్విక్ పెద్ద పేగు కేన్సర్ తో ( Colon Cancer ) మరణించినట్టు అతని కుటుంబ సభ్యులు ప్రపంచానికి తెలియజేశారు

Chadwick Boseman: అస్తమించిన బ్లాక్ పాంథర్ చాడ్విక్ బోస్మాన్

బ్లాక్ పాంథర్ మూవీతో వసూళ్ల వర్షం కురిపించిన నటుడు చాడ్విక్ బోస్మాన్ ( Chadwick Boseman ) కన్నుమూశారు. 43 సంవత్సరాల చాడ్విక్ పెద్ద పేగు కేన్సర్ తో ( Colon Cancer ) మరణించినట్టు అతని కుటుంబ సభ్యులు ప్రపంచానికి తెలియజేశారు. గత నాలుగేళ్లుగా చాడ్విక్ కేన్సర్ తో బాధ పడుతున్నట్టు.. స్టేజ్ త్రీ అవడం వల్ల అన్ని ప్రయత్రాలు చేసినా కాపాడలేకపోయాం అని తెలిపారు. బ్లాక్ పాంథర్ మూవీలో కింగ్ పాత్రతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న చాడ్విక్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

2016లో చాడ్విక్ నటించిన కెప్టెన్ అమెరికా: సివిల్ వార్ చిత్రంలో బ్లాక్ పాంథర్ ( Black Panther ) పాత్ర అతనికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అలాగే అవేంజర్స్ సిరీస్ లో వచ్చిన ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్ లో బ్లాక్ పాంథర్ గా కనిపించాడు.  బ్లాక్ పాంథర్ హాలీవుడ్ లో వేల కోట్లు కలెక్ట్ చేసింది. దాని సీక్వెల్  కోసం సిద్ధం అవుతున్న తరుణంగా కింగ్ మరణంతో ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు.

Read More