Home> అంతర్జాతీయం
Advertisement

Baby girl with tail: తోకతో పుట్టిన చిన్నారి.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Baby girl born with a small tail: మెక్సికోలో ఓ అరుదైన ఘటన జరిగింది,  అదేమంటే దాదాపు 6 సెంటీమీటర్ల తోకతో ఒక ఆడపిల్ల జన్మించింది. ఇక ఆమెను చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు కానీ అసలు విషయం కనిపెట్ట లేకపోయారు. ​
 

Baby girl with tail: తోకతో పుట్టిన చిన్నారి.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

Baby girl in Mexico was born with a small tail: మెక్సికోలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది, దాదాపు 6 సెంటీమీటర్ల తోకతో ఒక ఆడపిల్ల జన్మించింది. ఇక ఆమెను చూసిన వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై అక్కడి వైద్యులు మాట్లాడుతూ.. వైద్య శాస్త్రంలో ఇలాంటి కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయని అన్నారు. అక్కడి డైలీ మెయిల్ పత్రిక కధనం ప్రకారం, ఈశాన్య మెక్సికోలోని న్యూవో లియోన్ రాష్ట్రంలోని గ్రామీణ ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా ఈ ఆడ శిశువు జన్మించింది.

ఆమె జన్మించిన కొంచెం సేపటికి వైద్యుల బృందానికి ఆ బాలిక తోక గురించి తెలిసిందని అంటున్నారు. ఇక ఆమె తోక పొడవు 5.7 సెం.మీ, వ్యాసం 5 మి.మీ ఉందని, అంతేకాక తోకపై తేలికపాటి వెంట్రుకలు కూడా ఉన్నాయని గుర్తించారు. ఇక ఆ తోక చివర బంతిలా గుండ్రంగా ఉందని తేలింది. ఇక జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్ సర్జరీలో ఈ కేసుకు సంబంధించి, గర్భధారణ సమయంలో తల్లికి ఎలాంటి సమస్య ఎదురవ లేదని పేర్కొన్నారు.

రేడియేషన్, ఇన్ఫెక్షన్ మొదలైన వాటికి కూడా సదరు బాలింత ఎక్స్ పోజ్ అవలేదని, ఆమెకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, అతను పూర్తి ఆరోగ్యంగా జన్మించాడని పేర్కొన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తోకతో రెండోసారి ఆడబిడ్డ పుట్టడంతో డాక్టర్లు ఆశ్చర్యపోయారు. దీంతో పరిశోధన చేయడం కోసం లంబోసాక్రల్ ఎక్స్-రే చేశారు, కానీ తోక లోపల ఎముక ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లభించ లేదు. తోక మానవ నాడీ వ్యవస్థకు అనుసంధానించబడలేదు కాబట్టి దానిని శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు.

'తోక మెత్తగా, చర్మంతో కప్పబడి, దానిపై లేత వెంట్రుకలు ఉన్నాయని, దానిని ఎలాంటి నొప్పి లేకుండా నిష్క్రియంగా తొలగించవచ్చని పేర్కొన్నారు. అన్ని పరీక్షలు చేసిన తరువాత, సర్జన్లు చిన్న ఆపరేషన్‌తో బాలిక శరీరం నుండి ఆ తోకను తొలగించారు. ఇక ఆ బాలిక ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి రెండు నెలలు దాటినా ఇంకా ఎలాంటి సమస్య రాలేదని డాక్టర్లు వెల్లడించారు.
Also Read: PM Narendra Modi: నరేంద్ర మోదీ గురువు కన్నుమూత.. ట్విట్టర్‌లో ప్రధాని ఎమోషనల్

Also Read: School Students: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా విమాన, రైలు ప్రయాణం.. ఎక్కడో తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
Read More