Home> అంతర్జాతీయం
Advertisement

ఘోరం.. కొండచరియలు విరిగిపడి 50మంది దుర్మరణం

Jade Mine Landslide | కొండ చరియలు ఒక్కసారిగా విరిగిపడ్డ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్షణాల వ్యవధిలో పెను విషాదం చోటుచేసుకుంది. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.

ఘోరం.. కొండచరియలు విరిగిపడి 50మంది దుర్మరణం

Myanmar Jade Mine Landslide | మయన్మార్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జేడ్ అనే గని వద్ద కొండ చరియలు (Landslide) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో కనీసం 50 మంది మరణించి ఉంటారని మయన్మార్ అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉండటం గమనార్హం. భారీ వర్షం కారణంగా గనిలో కొండ చరియలు విరిగి పడి ఉంటాయని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఉత్తర మయన్మార్‌లో ఈ గని ఉంది.  ‘పోలీసు కస్టడీ డెత్’ కేసులో మరో ముగ్గురు పోలీసుల అరెస్ట్

కాచిన్ రాష్ట్రంలోని జేడ్ - రిచ్ హెచ్‌పకాంత్ ప్రాంతంలో కొందరు మైనర్ బాలురు తమకు అవసరమయ్యే రాళ్లను ఏరుతుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డట్లు తెలుస్తోంది. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. అయితే వర్షాల కారణంగా ముద్దగా ఉండటంతో సహాయక చర్యలు అంత తేలికేమీ కాదని సమాచారం. GVK గ్రూప్ చైర్మన్‌పై సీబీఐ కేసు.. వందల కోట్ల చీటింగ్!

అయితే మైనర్లు ఆ గనివైపు వెళ్లేందుకు, అక్కడ తిరిగేందుకు పర్మిషన్ ఉందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. కాగా, రెండేళ్ల కిందట ఇదే జేడ్ గనిలో కొండ చరియలు విరిగిపడ్డ (Jade Mine Landslide) ఘటనలో దాదాపు 20 మంది మరణించడం విధితమే. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

Read More