Home> అంతర్జాతీయం
Advertisement

వ్యక్తిగత వివరాలు తెలియడం ప్రమాదకరం: కుక్

ఫేస్‌బుక్‌ డేటా లీక్ ఉదంతంపై ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యక్తిగత వివరాలు తెలియడం ప్రమాదకరం: కుక్

ఫేస్‌బుక్‌ డేటా లీక్ ఉదంతంపై ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా అభివృద్ధి వేదికలో ప్రసంగించిన ఆయన ఫేస్‌బుక్‌​ యూజర్ డేటా ఉల్లంఘన కుంభకోణంపై స్పందించారు. యూజర్ల డేటా విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలని మళ్లీ ఈ ఘటన హెచ్చరిస్తోందని కుక్ అన్నారు. ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు ఇలాంటి వివాదాల్లో ఉండటం విచారకరమని, పరిస్థితి ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న వాతావరణంలో ఆపిల్‌ యూజర్ల భద్రతపై ఆందోళన చెందుతున్నామని.. యూజర్లు ఏం చేస్తున్నారనేది ఇతరులకు తెలియడం ప్రమాదకరమన్నారు.  వ్యక్తిగత వివరాలు బహిర్గతం కాకూడదని కుక్‌ అభిప్రాయపడ్డారు. గతకొన్ని సంవత్సరాలుగా చాలాదేశాల్లో డేటా ఉల్లంఘన సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేపుతోందన్నారు.  

కాగా యూజర్ల సమాచారం విక్రయానికి గురైందన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే టాప్‌ సంస్థలు ఫేస్‌బుక్‌పై తీవ్రంగా స్పందించాయి. ముఖ్యంగా వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్‌ ఆక్టన్‌ డిలీట్‌ ఫేస్‌బుక్‌ ఉద్యమానికి నాంది పలికాడు. ఫేస్‌బుక్‌ పేజీలను డిలిట్‌ చేస్తున్నట్టు స్సేస్‌ ఎక్స్‌ అధిపతి ఎలన్‌ మస్క్‌ ప్రకటించడం మరింత ఆందోళనలు రేపింది. తాజాగా ఆపిల్‌ సీఈవో వ్యాఖ్యలు ఫేస్‌బుక్‌పై ఒత్తిడిని తీవ్రం చేసింది.

Read More