Home> అంతర్జాతీయం
Advertisement

పాక్ మంత్రిపై నల్లటి సిరను జల్లిన ఆగంతకుడు..!

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ పై ఓ సామాన్య పౌరుడు నల్లటి సిరాబుడ్డిని విసిరాడు

పాక్ మంత్రిపై నల్లటి సిరను జల్లిన ఆగంతకుడు..!

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్ పై ఓ సామాన్య పౌరుడు నల్లటి సిరాబుడ్డిని విసిరాడు. మంత్రి సియాల్ కోట్‌లో జరిగిన పార్టీ మీటింగ్‌లో ప్రసంగిస్తున్నప్పుడు ఆ ఘటన చోటు చేసుకుంది. మంత్రిపై నల్లటి సిర పడగానే.. పార్టీ వర్కర్లందరూ ఆ పౌరుడిపై దాడి చేశారు. ఆ తర్వాత మంత్రి వారిస్తున్నా... దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఆ పౌరుడిని విచారించిన పోలీసులు అతని పేరు ఫైజ్ రసూల్ అని తెలుసుకున్నారు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. ఇటీవలే ప్రభుత్వం ముస్లిం ప్రవక్త మహమ్మద్ సూత్రాలను రాజ్యాంగంలో వక్రీకరించి రాసినందుకు నిరసనగా తాను ఈ పనిచేశాడని తెలపడం గమనార్హం. తన భావాలు దెబ్బతిన్నందుకు ఆయన ఈ పనిచేశానని తెలిపాడు.

అయితే తనపై సిరను జల్లిన యువకుడిపై తనకు ఎలాంటి కోపం లేదని.. ఆయన ఉద్వేగంలో ఆ పని చేసుంటాడని.. తనను విడిచిపెట్టమని పోలీసులకు చెబుతానని మంత్రి తెలిపారు. పాకిస్తాన్‌లో ఇలాంటి ఘటనలు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన బూట్లను విసిరాడు. 

Read More