Home> అంతర్జాతీయం
Advertisement

Hajj Pilgrims: హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఎండ వేడికి తాళలేక పిట్టల్లా రాలుతున్న భక్తులు

19 Pilgrims Dead With Heat Stroke In Hajj Yatra: జన్మలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర మక్కాలో మృత్యు ఘోష మోగుతోంది. అధిక వేడితో భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. దీంతో హజ్‌ యాత్రలో తీవ్ర విషాదం ఏర్పడింది.

Hajj Pilgrims: హజ్‌ యాత్రలో మృత్యుఘోష.. ఎండ వేడికి తాళలేక పిట్టల్లా రాలుతున్న భక్తులు

Hajj Pilgrims: పవిత్ర హజ్‌ యాత్రలో ఎండ తీవ్రరూపం దాలుస్తోంది. దీని కారణంగా యాత్రకు వెళ్లిన భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. యాత్రలో ఎండ వేడిమికి తాళలేక ఇప్పటివరకు 19 మంది మృతి చెందడంతో హజ్‌ యాత్ర తీవ్ర విషాదంగా మారుతోంది. వేడిమి నుంచి ఉపశమనం కలిగించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నా ప్రాణ నష్టం తప్పడం లేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో హజ్‌ యాత్రకు వెళ్లిన భక్తుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Also Read: Lizard Biryani: నిన్న చేతి వేలు, నేడు బల్లి.. ఖంగుతిన్న బిర్యానీ ప్రియుడు

బక్రీద్‌ ఈద్‌ ఉల్‌ అజా పండుగ సందర్భంగా పవిత్ర మక్కాకు పెద్ద సంఖ్యలో ముస్లింలు వెళ్తున్నారు. దీంతో మక్కా ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. సౌది అరేబియాలో ప్రస్తుతం ఎండలు తీవ్ర రూపం దాల్చాయి. ఎండలు, ఉక్కపోతతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ వేడిమి కారణంగా 19 మంది మృతి చెందారని సౌదీ అధికారులు ప్రకటించారు. అయితే మరణించిన వారిలో జోర్డాన్‌, ఇరాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నారు.

Also Read: Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ

అత్యధిక ఉష్ణోగ్రతలు
'14 జోర్డానియన్‌ భక్తులు మరణించగా మరో 17 మంది అదృశ్యమయ్యారు. వారి మృతికి గల కారణాలు ఇంకా తెలియలేదు' అని జోర్డాన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 37 దాటితే మక్కాలో విపరీతమైన వేడి ఉంటుంది. 40 డిగ్రీలకు చేరడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాగా గతేడాది కూడా ఇదే తీరున మరణాలు భారీగా సంభవించాయి. 2023 హజ్‌ యాత్రలో 240 మంది భక్తులు మరణించారు. వారిలో ఇండోనేసియాకు చెందిన వారే అధికంగా ఉన్నారు. కాగా ప్రతి దశాబ్దం సౌదీ అరేబియాలో 0.4 డిగ్రీల వేడి పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. కాగా ఈ ఏడాది హజ్‌ యాత్రకు 18 లక్షల మంది భక్తులు హాజరవుతారని అక్కడి నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ హజ్‌ యాత్ర ఈనెల 19వ తేదీ బుధవారంతో ముగియనుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

 

Read More