Home> అంతర్జాతీయం
Advertisement

School Gym roof collapsed: చైనాలో విషాదం.. స్కూల్ జిమ్ పైకప్పు కూలి 10 మంది మృతి..

China tragedy: చైనాలో ఘోర విషాదం జరిగింది.  స్కూల్ జిమ్ పైకప్పు కూలిన ఘటనలో పది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది. 
 

School Gym roof collapsed: చైనాలో విషాదం.. స్కూల్ జిమ్ పైకప్పు కూలి 10 మంది మృతి..

School Gym Collapse in china: పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయిన(School Gym roof collapsed) ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఈశాన్య చైనాలోని హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో (Heilongjiang Province) ఉన్న క్వికిహార్‌ లో  34వ నంబర్ మిడిల్ స్కూల్‌ జిమ్ లో జరిగింది. మరోకరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డయ్యాయి. సోమవారం ఉదయం నాటికి శిథిలాల నుండి 14 మందిని బయటకు తీశారు, 

ఈ జిమ్ 1,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ప్రమాద సమయంలో జిమ్ లో 19 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలోని నలుగురు తప్పించుకోగా... మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు రెస్క్కూ అపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 160 మంది అగ్నిమాపక సిబ్బంది మరియు 39 అగ్నిమాపక ట్రక్కులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మృతి చెందినవారిలో విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. 

చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మరియు సరిగా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటాయి. 2015లో టియాంజిన్‌లో ఒక రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ పేలుడులో 165 మంది మరణించారు.

Also read: Afghanistan Floods: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వరదలు.. 26 మంది మృతి.. 40 మంది గల్లంతు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More