Skin Care: మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు.. తాగాల్సింది ఈ డ్రింక్స్

మెరిసే చర్మం

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఎక్కువగా ఉంటుంది. ముఖం మెరిచేందుకు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్టులను వాడుతుంటారు.

రిఫ్రెష్ జ్యూసులు

ముఖం మెరిసిపోవాలంటే క్రీములపై కాకుండా జ్యూసులపై ఆధారపడాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఈ 6 రకాల జ్యూసులు తాగితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. అవేంటో చూద్దాం.

లెమన్ జ్యూస్

లెమన్ వాటర్ క్లాసిగ్ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడంలో మేలు చేస్తుంది.

ఆపిల్ సెలెరీ జ్యూస్

యాపిల్, సెలెరీ జ్యూసులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని నిర్విషీకరణ చేసి స్కిన్ మెరిచేలా చేస్తుంది.

అలోవెరా జ్యూస్

అలోవెరా జ్యూస్ హైడ్రేషన్, డిటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది. ఇది స్మూత్, మరింత మెరుస్తున్న ముఖ ఛాయను అందిస్తుంది.

క్యారెట్, ఆరెంజ్ జ్యూస్

ఈ శక్తివంతమైన జ్యూసులో విటమిన్ సి, బీటా కెరోటిన్ ప్రయోజనాలు ఉన్నాయి. చర్మం మెరిచేలా చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం ఈ జ్యూసు తాగితే మీ ముఖం అందంగా మారుతుంది.

బీట్ రూట్ జ్యూస్

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బీట్ రూట్ జ్యూస్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది పవర్ ఫుల్ డిటాక్సిఫైయింగ్ డ్రింక్.

Read Next Story