హెల్తీ క్యాబేజీ పకోడా రెసిపీ.. క్రిస్పీగా రుచి వేరే లెవెల్..

పిల్లలనుంచి పెద్దవారికి వరకు ఎంతో ఇష్టపడి తినే స్నాక్స్ లో పకోడీ ఒకటి.. చలికాలంలో ఎక్కువగా స్నాక్స్ గా తింటూ ఉంటారు.

దక్షిణ భారతీయులు పకోడీని ఉల్లి పాయలతో తయారు చేసుకుంటే మరికొన్ని ప్రాంతాల్లోనైతే వివిధ రకాల వెజిటేబుల్స్ తో కూడా తయారు చేసుకుంటారు.

ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా క్యాబేజీతో కూడా పకోడీని తయారు చేసుకుంటారు. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.

క్యాబేజీతో తయారుచేసిన పకోడీలో కూడా శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. మీరు కూడా ఇంట్లోనే ఈ పకోడీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా?

క్యాబేజీ పకోడీ తయారు కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

కావలసిన పదార్థాలు: క్యాబేజీ - 1/2 కిలో (చిన్న ముక్కలుగా కోసి, నీరు పిండుకోవాలి), బెసన్ - 1 కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్, ఆవాలు - 1/2 స్పూన్, జీలకర్ర - 1/4 స్పూన్

కావలసిన పదార్థాలు: కారం పొడి - రుచికి తగినంత, అల్లం ముక్కలు - కొన్ని, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత

కావలసిన పదార్థాలు: నీరు - అవసరమైనంత, నూనె - వేయడానికి, గరం మసాలా, స్పెషల్ పకోడీ మసాలా

తయారీ విధానం: ముందుగా ఈ పకోడీ తయారు చేసుకోవడానికి ఒక పాత్రలో శనగపిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ఉప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా కలపాలి.

ఆ తర్వాత బాగా కలుపుకున్న పిండిలోనే క్యాబేజీ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి మెత్తగా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.

ఆ తర్వాత పిండి పై కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుతూ పిండిని నొక్కుతూ బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది.

పిండిని పకోడా మిశ్రమంలో నీటిని వేసుకుని బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ పై పెద్ద మూకుడు పెట్టుకొని అందులో పకోడాలకు కావలసిన నూనెను వేసుకొని బాగా వేడి చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ నూనెలో పిండిని కొద్ది కొద్దిగా పకోడీల్లాగా వేసుకోవాల్సి ఉంటుంది.

నూనెలో వేసుకున్న పకోడీలను బాగా కలుపుతూ బంగారు రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి. బంగారు రంగు వచ్చిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి.

Read Next Story