గ్యాస్ట్రిక్ కారణంగా తల నొప్పి వస్తుందా? ఇలా చెక్ పెట్టండి..

ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే గ్యాస్టిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు అనేక జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి.

గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా కొంతమందిలో జీర్ణక్రియ మందగించి ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.

మరికొంతమందిలోనైతే గ్యాస్ట్రిక్ కారణంగా తలనొప్పి కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి అనేక రెమెడీస్ ఉన్నాయి.. అందులో కొన్ని పండ్ల రసాలకు సంబంధించిన రెమెడీలు తెలుసుకోండి..

మెగ్నీషియం అధికంగా ఉండే బాదంపాలను తాగడం వల్ల కూడా గ్యాస్టిక్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇందులో ఉండే గుణాలు అజీర్ణం వంటి సమస్యలనుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.

జామ పండ్ల జ్యూస్ తాగడం వల్ల కూడా ఏ గ్యాస్టిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పొట్టను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి.

గ్యాస్టిక్ సమస్య నుంచి ప్రభావంతంగా ఉపశమనం కలిగించే రెమెడీస్ లో ద్రాక్ష పండ్ల రసం కూడా ఒకటి.. ఈ రసం తాగడం వల్ల సులభంగా పొట్ట సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

పైనాపిల్ రసం తాగడం వల్ల కూడా గ్యాస్టిక్ సమస్య నుంచి విముక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు పొట్టను ఆరోగ్యంగా చేసి అన్ని సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

రోజు ఉదయాన్నే కివి ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల కూడా అపాన వాయువు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొట్టన ఆరోగ్యంగా చేస్తాయి.

Read Next Story