Ghee: వేడి నీళ్లలో 1 చెంచా నెయ్యి కలుపుకుని తాగితే ఏమౌతుంది?

మలబద్దకం

మలబద్దకం సమస్యతో బాధపడేవారు వేడి నీళ్లలో 1 చెంచా నెయ్యి కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

చర్మానికి

నెయ్యిలో ఉండే సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. వేడినీళ్లలో నెయ్యి కలిపి తాగితే చర్మం మెరుస్తుంది.

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం

ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకుంటే శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. జ్వరం, జలుబు అంటు వ్యాధులను నయం చేస్తుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది.

మెదడు ఆరోగ్యం

గోరువెచ్చని నీళ్లలో నెయ్యి తీసుకుంటే మెదడుకు తగినంత కొవ్వు అందుతుంది. దేశీ నెయ్యి బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతుంది. అభిజ్నా పనితీరు, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గడం

దేశీ నెయ్యి శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ ను, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. వేడి నీటిలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోతుంది.

కంటిచూపు

దేశీ నెయ్యి కళ్లకు కూలింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కళ్లకు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

టాక్సిన్స్

వేడి నీటిలో నెయ్యి కలిగి తాగితే శరీరంలోని హానికరమైన కణాలు, టాక్సిన్స్, చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యానికి

నెయ్యిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు మేలు చేస్తాయి. ఇవే కాకుండా కేలరీలు, ఆరోగ్య కరమైన కొవ్వులు, విటమిన్లు, ఎ, ఇ నెయ్యిలో లభిస్తాయి.

ఒత్తిడి

ప్రతిరోజూ గోరువెచ్చని నీళ్లలో నెయ్యి వేసుకుని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలుగుతుంది. దేశీ నెయ్యిలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Read Next Story