Nails: అందమైన గోళ్ళ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

అందమైన గోళ్ళను మెయింటైన్

ప్రతి మహిళకు అందమైన గోళ్ళను మెయింటైన్ చేయాలని కోరిక ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.

గోళ్లు పాలిపోయి

కొంతమంది గోళ్లు పాలిపోయి అందవిహీనంగా మారుతూ ఉంటాయి. వాటిపైన తెల్లటి మచ్చలు ఏర్పడుతుంటాయి.

చక్కటి పోషకాహారం

ఇలాంటి సమస్యల నుంచి బయట పడాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అందమైన గోళ్లు ఏర్పడతాయి.

విటమిన్ ఈ

గోళ్లు మంచి రంగుతోను నునుపుగా ఏర్పడాలంటే.. విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

ఆకుకూరలు, కోడిగుడ్లు, చేపలు

విటమిన్ ఈ పుష్కలంగా ఉండే ఆహారంలో ఆకుకూరలు కోడిగుడ్లు చేపలు ప్రముఖంగా ఉంటాయి.

బాదం నూనెతో మాలిష్

అలాగే తరచూ మీగోళ్ల కు బాదం నూనెతో మాలిష్ చేసుకుంటూ ఉండాలి. అంతేకాదు గోళ్లను మరి ఎక్కువగా పెరగకుండా కట్ చేస్తూ ఉండాలి.

గోళ్లు అందవిహీనంగా

గోళ్లు అందవిహీనంగా మారినప్పుడు.. వెచ్చటి నీళ్లలో చేతులను ముంచి ఉప్పు కలిపి శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గోళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.

పాలిష్ నాణ్యమైన కంపెనీది

గోళ్లకు వాడే పాలిష్ నాణ్యమైన కంపెనీది వాడాలి. లేకపోతే గోళ్లు దెబ్బ తినే ప్రమాదం ఉంది.

కొబ్బరి నూనెతో మసాజ్

గోళ్లు అందంగా కనిపించాలంటే కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీ గోళ్లు బెల్స్ బారకుండా మెత్తగా ఉంటాయి.

Read Next Story