Business Ideas: సొంత ఊరులోనే రూ. 50వేలతో చేసే వ్యాపారాలు లక్షల్లో సంపాదన

బిజినెస్

మనలో చాలా మందికి బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. కానీ వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి లేక వెనకడుగు వేస్తుంటారు. కొంందరు బిజినెస్ అంటే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పట్టణాల్లో మాత్రమే చేస్తారను అనుకుంటారు.

తక్కువపెట్టుబడితో

పట్టణాలే కాదు గ్రామాల్లోనూ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందించే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. మీ దగ్గర రూ. 50వేలు ఉంటే చాలు. ఉన్న ఊర్లోనే వ్యాపారం ప్రారంభించవచ్చు.

మొబైల్ రిపేర్ షాప్

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయ్యింది. కానీ మొబైల్ రిపేర్ వచ్చిందంటే పట్టణానికి పరుగెత్తాలి. మీరే గ్రామంలో మొబైల్ రిపేర్ షాప్ పెడితే గ్రామస్థులు మీ షాపులోనే రిపేర్ చేయించుకుంటారు.

కూరగాయలు దుకాణం

కూరగాయలు, పండ్లు వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. రైతుల నుంచి సేకరించిన కూరగాయలను, పండ్లను ఊరులోనే అమ్మితే మంచి లాభాలను పొందవచ్చు.

టైలరింగ్ షాప్

టైలరింగ్ షాప్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. మీరు ఉన్న ఊరులోనే టైలరింగ్ షాపు ప్రారంభిస్తే మంచి లాభాలు ఉంటాయి.

బ్యూటీ పార్లర్

అందానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. బ్యూటీ పై పెట్టుబడి పెడితే నష్టాలు ఉండవు. మీ గ్రామంలోనే బ్యూటీ పార్లర్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది. ఆలస్యం ఎందుకు వెంటనే స్టార్ట్ చేయండి.

పౌల్ట్రీ ఫార్మింగ్

ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్నది. అయినప్పటికీ మంచి లాభాలు ఉంటాయి. ఆడుతూ, పాడుతూ పౌల్ట్రీ ఫాంను నిర్వహించవచ్చు.

అగరబత్తులు

ఇంట్లోనూ కూర్చుండి మహిళలు దూప్ స్టిక్స్, అగరబత్తులు తయారు చేస్తూ మంచి లాభాలను పొందవచ్చు.

పచ్చళ్లు:

మామిడి, ఉసిరి, నిమ్మ, చింతకాయ ఇలా ఎన్నో రకాల పచ్చళ్లు ఉంటాయి. వీటిని ఇంట్లోనే తయారు చేసి అమ్ముతే మంచి సంపాదన ఉంటుంది.

Read Next Story