Videos

Diwali Special : కారుకు లక్ష పటాకులు కట్టి పేల్చేశాడు.. యూట్యూబర్‌ దివాళి స్పెషల్

Diwali Special : దీపావళి పండుగను ఓ యూట్యూబర్‌ వినూత్నంగా జరుపుకున్నాడు. కారును ఏకంగా లక్ష టపాసులతో అలంకరించాడు. కారు చుట్టూ లక్ష టపాసులకు వరసగా పేర్చాడు. కారు ముందున్న గ్లాస్‌పై టపాసులు పెట్టలేదు. అనంతరం వాటిని పేల్చాడు. దీంతో ఆ ప్రాంతమంతా బాంబుల శబ్ధంతో మారుమోగింది. ఆ తర్వాత మళ్లీ కారు దగ్గరకు వెళ్లాడు. టపాసులు పేలడంతో కారు కలర్ మారిపోయింది. కారు లోపల పొగ నిండిపోయింది. కారు అద్ధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఇంజన్‌ మాత్రం బాగా పనిచేస్తోందని యూట్యూబర్ తెలిపాడు.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More