Videos

వైట్నర్ సేవిస్తూ పట్టుబడిన మైనర్లు.. వైరల్ వీడియో

kids caught taking whitener in Hyderabad: హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీలో కొందరు చిన్నారులు వైట్నర్ సేవిస్తూ మీడియా కెమెరాకు చిక్కారు. నలుగురు అబ్బాయిలు, ఓ చిన్నారి.. మొత్తం ఐదుగురూ కలిసి వైట్నర్ సేవిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. వీరి వయస్సు 10 సంవత్సరాలలోపే ఉంటుందని వీడియో చూస్తే అర్థమవుతోంది. చిన్నారుల ప్రవర్తనపై అనుమానంతో వాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కునే ప్రయత్నం చేయగా.. తాము వైట్నర్ సేవిస్తున్నట్టు చిన్నారులే అమాయకంగా చెప్పడం చూస్తోంటే తెలిసీ తెలియని వయస్సులోనే బాల్యం మత్తులో తూగుతున్నట్టు స్పష్టమవుతోంది. 

వైట్నర్‌తో నషా ఎక్కుతోందంటూ.. నషాలోనే సమాధానం చెబుతున్న చిన్నారులు..
వైట్నర్ సేవించడం వల్ల ఏం జరుగుతుందని తిరిగి ప్రశ్నించగా.. నషా ఎక్కుతుందని చిన్నారులు చెప్పడం వీడియోలో రికార్డయింది. మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, గోషామహల్ ప్రాంతాల్లో వారికి ఈ మత్తు పదార్థం లభిస్తున్నట్టు చిన్నారులు వెల్లడించారు. విజయ్ నగర్ కాలనీలో పబ్లిగ్గానే ఇంత జరుగుతున్నా.. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ దృశ్యాలు కంటపడటం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇకనైనా స్థానిక హుమయున్ నగర్ పోలీసులు ఈ తరహా ఘటనలపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే నగరం బాల్యం మత్తుబాట పట్టడం ఖాయం అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు కొంతమంది యువతీయువకులు డ్రగ్స్ బారినపడి తమ జీవితాన్ని చిత్తు చేసుకుంటుండగా.. ఇప్పుడిలా పదేళ్ల ప్రాయంలోనే చిన్నారులు మత్తు పదార్థాల బారిన పడుతుండటం ప్రభుత్వాలకే కాదు.. సమాజానికి సైతం పెను సవాలుగా పరిణమించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.

kids caught taking whitener in Hyderabad: మత్తులో చిత్తవుతున్న బాల్యం.. వైట్నర్ సేవిస్తూ కెమెరాకు చిక్కిన మైనర్లు

Video Thumbnail
Advertisement

kids caught taking whitener in Hyderabad: హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీలో కొందరు చిన్నారులు వైట్నర్ సేవిస్తూ మీడియా కెమెరాకు చిక్కారు. నలుగురు అబ్బాయిలు, ఓ చిన్నారి.. మొత్తం ఐదుగురూ కలిసి వైట్నర్ సేవిస్తుండటం ఈ వీడియోలో చూడవచ్చు. వీరి వయస్సు 10 సంవత్సరాలలోపే ఉంటుందని వీడియో చూస్తే అర్థమవుతోంది. చిన్నారుల ప్రవర్తనపై అనుమానంతో వాళ్లు ఏం చేస్తున్నారో కనుక్కునే ప్రయత్నం చేయగా.. తాము వైట్నర్ సేవిస్తున్నట్టు చిన్నారులే అమాయకంగా చెప్పడం చూస్తోంటే తెలిసీ తెలియని వయస్సులోనే బాల్యం మత్తులో తూగుతున్నట్టు స్పష్టమవుతోంది.  వైట్నర్‌తో నషా ఎక్కుతోందంటూ.. నషాలోనే సమాధానం చెబుతున్న చిన్నారులు.. వైట్నర్ సేవించడం వల్ల ఏం జరుగుతుందని తిరిగి ప్రశ్నించగా.. నషా ఎక్కుతుందని చిన్నారులు చెప్పడం వీడియోలో రికార్డయింది. మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, గోషామహల్ ప్రాంతాల్లో వారికి ఈ మత్తు పదార్థం లభిస్తున్నట్టు చిన్నారులు వెల్లడించారు. విజయ్ నగర్ కాలనీలో పబ్లిగ్గానే ఇంత జరుగుతున్నా.. పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ దృశ్యాలు కంటపడటం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఇకనైనా స్థానిక హుమయున్ నగర్ పోలీసులు ఈ తరహా ఘటనలపై దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే నగరం బాల్యం మత్తుబాట పట్టడం ఖాయం అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఓవైపు కొంతమంది యువతీయువకులు డ్రగ్స్ బారినపడి తమ జీవితాన్ని చిత్తు చేసుకుంటుండగా.. ఇప్పుడిలా పదేళ్ల ప్రాయంలోనే చిన్నారులు మత్తు పదార్థాల బారిన పడుతుండటం ప్రభుత్వాలకే కాదు.. సమాజానికి సైతం పెను సవాలుగా పరిణమించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఏమని స్పందించనుందో వేచిచూడాల్సిందే మరి.

View More Videos
Read More