Videos

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మరో వారం కుండపోతే.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..

Rain Alert : తెలుగు రాష్ట్రాలను వదల బొమ్మాళి అంటున్నాడు వరుణుడు. గత వారం రోజులుగా కుమ్మేస్తున్నాడు. రోజూ మధ్యాహ్నం ఎండ దంచి కొట్టడం.. సాయంత్రానికి వర్షం రావడం కామన్ గా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గంటల్లోనే ఐదు నుంచి 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. తాజాగా మరో వారం రోజుల పాటు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Video Thumbnail
Advertisement

View More Videos
Read More