Home> తెలంగాణ
Advertisement

Ys Sharmila: వైఎస్‌ఆర్ ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారు..షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

Ys Sharmila: తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.

Ys Sharmila: వైఎస్‌ఆర్ ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారు..షర్మిల సంచలన వ్యాఖ్యలు..!

Ys Sharmila: కాంగ్రెస్‌పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ..కాంగ్రెస్‌ కాదని..ఆయన తన తండ్రి అని అన్నారు. వైఎస్ఆర్‌కు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని తాను పబ్లిక్‌గా చెబుతున్నానని..30 ఏళ్లపాటు ఆ పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారని స్పష్టం చేశారు. 

కేంద్రంలో ఆ పార్టీ రావాడానికి వైఎస్ఆర్‌ ఎంతో కీలకంగా వ్యవహరించారని చెప్పారు. అలాంటి వ్యక్తి చనిపోతే దోషి అంటూ ఎఫ్‌ ఐఆర్‌లో నమోదు చేశారని విమర్శించారు. ఇది వైఎస్‌ఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లు కాదా అని ప్రశ్నించారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఎలా చనిపోయారని దర్యాప్తు కూడా చేయించలేదన్నారు వైఎస్ షర్మిల. అసలు పట్టించుకోలేదన్నారు. ఆ పార్టీకి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. అలా చేసి ఇప్పుడు వైఎస్ఆర్‌ ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడం ఏంటన్నారు షర్మిల. 

వైఎస్ఆర్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆయన బతికి ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మి వేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఖ్యాతి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ చేసిందేమి లేదని విమర్శించారు. నాయకుడు అంటే వైఎస్ఆర్‌ లాంటి వ్యక్తి అని తెలిపారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ వంటి పథకాలను ఆయన తీసుకొచ్చారని గుర్తు చేశారు షర్మిల. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పథకాలు అమలు అవుతున్నాయా అని అన్నారు. వైఎస్‌ఆర్ ప్రజల మనిషి అని..వారి నుంచే ఇలాంటి పథకాలు వచ్చాయని చెప్పారు. 

పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి..అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకున్నారన్నారు. ఖరీదైన వైద్యాన్ని కూడా ప్రజలకు చెంతకు చేర్చారన్నారు షర్మిల. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని..ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, 108, 104 వంటి పథకాలను తీసుకొచ్చారని స్పష్టం చేశారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రజలను సొంత బిడ్డలా చూసుకున్నారని తెలిపారు. అలాంటి పాలన మళ్లీ తీసుకొస్తామన్నారు. తెలంగాణలో తనను ఆదరిస్తే..వైఎస్‌ఆర్ రాజ్యం తీసుకొస్తామని తేల్చి చెప్పారు. తమను ఆదరించాలని..ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న వారిని నిలబెట్టి అడుగుతామన్నారు షర్మిల.

Also read:Dussehra Special Trains: దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు.. ఆ వివరాలు..!

Also read:Minor Rape Case: మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More