Home> తెలంగాణ
Advertisement

Sharmila Comments: బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందాలు..షర్మిల ఆగ్రహం..!

Sharmila Comments: సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రం గురించి పట్టించుకోకుండా జాతీయ పర్యటనలు దేనికని మండిపడుతున్నాయి.

Sharmila Comments: బీజేపీ, టీఆర్ఎస్‌ మధ్య చీకటి ఒప్పందాలు..షర్మిల ఆగ్రహం..!

Sharmila Comments: సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రం గురించి పట్టించుకోకుండా జాతీయ పర్యటనలు దేనికని మండిపడుతున్నాయి. తాజాగా
సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలుపై ఢిల్లీ కోటలు బద్ధలు కొడుతామన్న మాట ఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రధాని మోదీని, బీజేపీని కడిగిపారేస్తాం..ఏకిపారేస్తాం అని గొప్పలు చెప్పారు..స్వయంగా మోదీనే ఇక్కడకు వస్తే ఎక్కడికి పారిపోయారని సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల విమర్శలు సంధించారు. 

తెలంగాణ ధాన్యం కొనుగోలుపై ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. మద్దతు ధర ఎందుకు ఇవ్వలేరని సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేకపోయారని ఫైర్ అయ్యారు. పిల్లిని చూసి ఎలుక దాక్కున్నట్లు అన్న చందంగా సీఎం కేసీఆర్,మంత్రులు, టీఆర్ఎస్ నేతల తీరు ఉందన్నారు. ఇంటి దాక వచ్చిన ప్రధానిని కలవడానికి మొహం చెల్లదు కానీ..ఢిల్లీకి పోయి రాజ్యాలు ఏలుతారా అని సూటిగా ప్రశ్నలు సంధించారు. 

కేసీఆర్ పాలన అంతా అవినీతిమయం అయ్యిందని ప్రధాని మోదీ చెప్పారని..మరి ఎందుకు బయటపెట్టడం లేదన్నారు వైఎస్ షర్మిల. ఇద్దరు ఎదురుపడకుండా ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్‌ నేతల మాటలన్నీ ప్రసంగాలకే పరిమితమన్నారు. ఒకరి అవినీతిని ఒకరు బయట పెట్టకూడదని చీకటి ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు.  ఇరుపార్టీల నేతలు ఒప్పందంలో భాగంగానే ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. 

Also read:TDP MAHANADU: ఉన్మాది చేతిలో పోలీసులు బలి కావొద్దు.. మహానాడు ప్రసంగంలో చంద్రబాబు

Also read:iPhone 12 Mini Flipkart: ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.20 వేలకే iPhone 12 Mini!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Read More